Krishna Kowshik
మణిరత్నం చిత్రాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిత్రం అమృత. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న ఈ మూవీ తెలుగులో అమృత పేరుతో డబ్ అయ్యి.. హిట్ అందుకుంది. ఇక ఇందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తన.. ఆ స్టార్స్ కూతురని తెలుసు.. కానీ అత్తారింటి బ్యాగ్రౌండ్ చూస్తే మాత్రం..
మణిరత్నం చిత్రాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిత్రం అమృత. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న ఈ మూవీ తెలుగులో అమృత పేరుతో డబ్ అయ్యి.. హిట్ అందుకుంది. ఇక ఇందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తన.. ఆ స్టార్స్ కూతురని తెలుసు.. కానీ అత్తారింటి బ్యాగ్రౌండ్ చూస్తే మాత్రం..
Krishna Kowshik
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ దశ దిశను మార్చేసిన దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన తెరకెక్కించిన ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి అమృత (తమిళంలో కన్నతిల్ ముత్తమిట్టల్). 2002లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక జాతీయ అవార్డులు సైతం కొల్లగొట్టింది. ఉత్తమ తమిళ చి త్రం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం, ఆడియోగ్రఫీ, ఎడిటింగ్ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక రాష్ట్ర అవార్డులు, ఫిల్మ్ ఫేర్, అంతర్జాతీయ అవార్డులను ఎన్నింటినో కొల్లగొట్టింది. ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ చైల్ట్ యాక్టర్‌గా అవతరించింది బేబి పీఎస్ కీర్తన. ఈ కీర్తన మరెవ్వరో కాదు కోలీవుడ్ ప్రముక దర్శకుడు, నటుడు పార్తీబన్, నటి సీతల కుమార్తె.
అమృత మూవీలో మాధవన్, సిమ్రాన్ హీరోహీరోయిన్లు అయినప్పటికీ.. కథ మొత్తం కీర్తన చుట్టూనే తిరుగుతుంది. శ్రీలంక అంతర్యుద్దం మధ్యలో తన రియల్ అమ్మనానల్ని కలవాలనే ఓ కూతురు చేసిన పోరాటమే ఈ అమృత. ఈ సినిమాలో ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లరి పిల్లగా ఆకట్టుకుంది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు కొల్లగొట్టింది. ఈ మూవీతో ఆమె వరుస సినిమాలతో తల్లీదండ్రుల బాటలోనే నడుస్తుందని ఊహించారు అంతా. కానీ ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఉన్నత చదువులు చదువుకుంది. ఆ తర్వాత పెద్ద ఇంటికి కోడలిగా వెళ్లింది. ఆమె అత్తారింటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. ఆమె భర్త అక్షయ్ ప్రముఖ దర్శకుడు.
అమృత అలియాస్ కీర్తన.. అక్కినేని ఇంటి కోడలని తెలుసా.? అక్కినేని అనగానే నాగేశ్వరరావు, నాగార్జున ఫ్యామిలీ అనుకునేరు కానే కాదు. ఆమె ప్రముఖ ఎడిటర్ ఎ శ్రీకర్ ప్రసాద్ కోడలు. శ్రీకర్ ప్రసాద్ ఇంటి పేరు కూడా అక్కినేనినే. శ్రీకర్ ప్రసాద్ తండ్రి అక్కినేని సంజీవి కూడా ప్రముఖ డైరెక్టర్ అండ్ ఎడిటర్. ఆయన తెలుగులో నాగేశ్వరరావు హీరోగా అక్కా చెల్లెళ్లు, ధర్మదాత, శోభన్ బాబు హీరోగా సిసింద్రీ చిట్టి బాబు వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇంకా చెప్పాలంటే.. సినిమా పయనీర్ ఎల్వీ ప్రసాద్ సోదరుడే ఈ సంజీవి. అంటే శ్రీకర్ ప్రసాద్‌కు స్వయానా పెద్దనాన్న. అక్షయ్‌కు తాత. ఇక అక్షయ్ పిజ్జా మూవీని హిందీలో తెరకెక్కించాడు. ఇక కీర్తన పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇంకే విశేషమేమిటంటే.. అమృత మూవీతోనే మామ, కోడలు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా, బెస్ట్ ఎడిటర్ గా జాతీయ అవార్డులు కొల్లగొట్టడం గమనార్హం.