Somesekhar
పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6 కు రిలీజ్ వాయిదా వేసుకుని రిలాక్స్ గా కనిపిస్తున్నప్పటికీ.. పుష్ప రాజ్ కు ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ఇంకా తీరని ఆ సమ్యలు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6 కు రిలీజ్ వాయిదా వేసుకుని రిలాక్స్ గా కనిపిస్తున్నప్పటికీ.. పుష్ప రాజ్ కు ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ఇంకా తీరని ఆ సమ్యలు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఓ సినిమాను తెరకెక్కించడం, దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత ఆషా మాషీ విషయం కాదు. 24 క్రాఫ్ట్ లను సమన్వయం చేసుకుంటూ.. డైరెక్టర్ తాను మైండ్ లో అనుకున్నది ప్రేక్షకులకు తెరపై చూపించాలి. ఈ ప్రాసెస్ లో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6 కు రిలీజ్ వాయిదా వేసుకుని రిలాక్స్ గా కనిపిస్తున్నప్పటికీ.. పుష్ప రాజ్ కు ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ఇంకా తీరని ఆ సమ్యలు ఏంటి? తెలుసుకుందాం పదండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2 వస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 కంటే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని అటు బన్నీ, ఇటు సుక్కు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే పుష్ఫ 2కి సంబంధించి చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్లు పట్టుదలతో ఉన్నప్పటికీ.. ఈ మూవీని కొన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఎప్పుడో సాంగ్ ను రికార్డ్ చేసిన పెట్టుకున్నాడట. సాంగ్ వినగానే అద్భుతం అనేట్టు ఉన్నాగానీ ఇప్పటి వరకు డైరెక్టర్ సుక్కు దాన్ని తెరకెక్కించలేదు. దానికి కారణం ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ఇంకా దొరకలేదట.
కాగా.. పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం దేవర బ్యూటీ జాన్వీ కపూర్ ను అడిగినట్లు సమాచారం. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ సరసన నటిస్తూ.. ఇలాంటి సాంగ్స్ చేస్తే ఇమేజ్ కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అని జాన్వీతో పాటుగా తండ్రి బోనీకపూర్ కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని సమాచారం. అదీకాక జాన్వీ ఈ సాంగ్ కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదీకాక వీలైనంత త్వరగా ఫహద్ ఫాజిల్ డేట్లు తీసుకుని అతడి పార్ట్ ను పూర్తి చేయడం పెద్ద టాస్క్ గా మారింది. ఎందుకంటే?
షూటింగ్ ఆలస్యం కారణంగా ఇప్పటికే ఫహద్ కొంత నిరాశలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. పైగా ఫహద్ చేతిలో 6,7 పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో అతడు అడిగినన్ని కాల్ షీట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో అతడు ఇచ్చిన డేట్స్ లోనే షూట్ ఫినిష్ చేయాలి సుక్కు. అదీకాక కాంబోలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్దవారే కావడం పెద్ద సమస్యగా మారింది. ఇన్ని సమస్యలను సుకుమార్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? అన్నదే ఇప్పుడు బిగ్ టాస్క్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.