iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ న్యూ డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండింగ్.. దీని ధర ఎంతో తెలుసా?

  • Published Aug 21, 2024 | 4:10 PM Updated Updated Aug 21, 2024 | 6:13 PM

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా షర్ట్ హ్యాండ్స్ తో డిజిటల్ ప్రింట్ కలిగిన రెడ్ కలర్ షర్ట్ ధరించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోటోలో అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ కాస్ట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా షర్ట్ హ్యాండ్స్ తో డిజిటల్ ప్రింట్ కలిగిన రెడ్ కలర్ షర్ట్ ధరించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోటోలో అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ కాస్ట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Aug 21, 2024 | 4:10 PMUpdated Aug 21, 2024 | 6:13 PM
అల్లు అర్జున్ న్యూ  డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండింగ్.. దీని ధర ఎంతో తెలుసా?

అప్పుడప్పుడు ట్రెండ్ ను ఫాలో అవ్వడమే కాదు, ట్రెండ్ సెట్ చేయడంలో కూడా కొంతమంది హీరోలు.. తమకంటూ ప్రత్యేకమైన ఈమేజ్ ను క్రియేట్ చేసుకుంటారు. మరీ, అలాంటి వారిలో ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ కూడా ఒకరు. ఎందుకంటే.. ఒక మాస్, క్లాస్, ఇలా అన్ని యాంగిల్స్ లో అల్లు అర్జున్ డ్రెస్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఎంతో సింప్లీసిటీగా ఉన్న ఈ హీరో ఎలాంటి డిఫరెంట్ డ్రెస్ వేసుకున్న సరే చాలా క్లాస్ గా కనిపిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరో షర్ట్ హ్యాండ్స్ తో కలిగిన రెడ్ కలర్ షర్ట్ లోనే ఉన్న ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ షార్ట్ లో అల్లు అర్జున్ మరోసారి తన ఫ్యాన్స్ ను ఫిదా చేశారనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఇంతకీ అల్లు అర్జున్ వేసుకున్న షార్ట్ కాస్ట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఎంతైనా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కదా.. ఇక ఆయన ధరించిన షర్ట్ అంటే ఏ లక్షల్లో ఉంటుందమో అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే..అల్లు అర్జున్ వేసుకున్న ఆ రెడ్ కలర్ షర్ట్ కాస్ట్ కేవలం వేలల్లో మాత్రమే ఉంది. పైగా దాని ధర ఐదు వేల రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. అదేంటి అంత తక్కువ అని ఆశ్చర్యపోతున్నరా.. నిజమేనండి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ షర్ట్ కాస్ట్ కేవలం రూ. 2,399 మాత్రమే. అయితే ఈ షర్ట్ ‘ఆద్యాస్’ బ్రాండ్ కు చెందినది. ఇకపోతే ఈ షర్ట్ సివిలెస్ తో పాటు లూజ్ ఫిట్ నెస్ కూడా కలిగి ఉంటుంది. పైగా రెడ్ కలర్ లో ఉన్న ఈ షర్ట్ పై బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లో అద్భుతమైన డిజిటల్ ప్రింట్ డిజైన్ కలిగివుంది. అయితే చూడటానికి మంచి డిజిటల్ ప్రింట్ తో డిజైన్ చేసి ఉన్న ఈ షార్ట్ అతి తక్కువ ధరకే అన్ లైన్ లో అందుబాటులోకి ఉండటం గమన్హారం. ముఖ్యంగా ఐకాన్ స్టార్ గా క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ ఇంత చవకైనా షర్ట్ ధరించడమనేది నిజంగా ఆశ్చర్యకరం. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోటోస్ తో పాటు ఈ షార్ట్ ధర కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Allu arjun wearing new shirt

ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటో అనేది ఆయ్ మూవీ చిత్ర యూనిట్ తో కలిసి దిగన సందర్భంలోనిది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌చంద్ర హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ఆయ్‌’. ఇందులో నయన్‌ సారిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అంతేకాకుండా.. ఈ సినిమాను తమకెంతో నచ్చిందని పలువురు సినీ ప్రియులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే.. నటుడు అల్లు అర్జున్‌ ఆయ్‌ మూవీ టీమ్‌ను మెచ్చుకున్నారు. ఈమేరకు బుధవారం చిత్రబృందం ఆయన్ని ప్రత్యేకంగా కలిసింది. పైగా టీమ్‌ సభ్యులందరికీ మొక్కలను అందజేసిన బన్నీ అందర్నీ ప్రశంసించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.మరీ, అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ కాస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap