iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ తో ఐకాన్ స్టార్ బన్నీ! ఇక ఫ్యాన్స్ కు జాతరే

  • Published Oct 09, 2024 | 5:16 PM Updated Updated Oct 09, 2024 | 5:16 PM

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఎవరెవరు గెస్ట్స్ గా వస్తారా అని అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురుచూస్తు ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్యతో జత కట్టేందుకు ఓ ఇంట్రెస్టింగ్ గెస్ట్ రాబోతున్నారట. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఎవరెవరు గెస్ట్స్ గా వస్తారా అని అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురుచూస్తు ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్యతో జత కట్టేందుకు ఓ ఇంట్రెస్టింగ్ గెస్ట్ రాబోతున్నారట. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

  • Published Oct 09, 2024 | 5:16 PMUpdated Oct 09, 2024 | 5:16 PM
బాలకృష్ణ తో ఐకాన్ స్టార్ బన్నీ! ఇక ఫ్యాన్స్ కు జాతరే

నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన షో అన్‌స్టాపబుల్ . ఆహా ఓటీటీ లో మొదలైన అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో.. రెండో సీజన్ కూడా కొనసాగించారు . ఇక ఈ సీజన్ కూడా అనుకున్నట్లుగానే హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన లిమిటెడ్ ఎడిషన్ కూడా మంచి సక్సెస్ అయింది. దీనితో ఇప్పుడు సీజన్ 3 కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ఆల్రెడీ ఈ సీజన్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు. సీజన్ 3కి మొదటి గెస్ట్ టాలీవుడ్ నుంచి కాకుండా.. మాలీవుడ్ నుంచి రాబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరోతో పాటు.. ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి.. నిర్మాత నాగవంశీ లు కూడా మొదటి ఎపిసోడ్ లో కనిపించనున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయిందనే బజ్ వినిపించింది.

ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ ఎప్పుడో తెలియదు కానీ.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ హీరోతో షూట్ స్టార్ట్ అయిందంట. అతను మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంకో రెండు నెలల్లో అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా రిలీజ్ రెడీగా ఉంది. సో దీనిని దృష్టిలో ఉంచుకునే అల్లు అర్జున్ తో ఈ ఎపిసోడ్ ను ప్లాన్ చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే కేవలం అల్లు అర్జున్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈ హీరో తో పాటు మూవీ టీమ్ నుంచి ఇంకెవరైనా ఉండే అవకాశం  లేకపోలేదు . ఈ షో ద్వారా పుష్ప-2 మూవీ గురించి మరిన్ని విశేషాలు పంచుకునే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇంకా ఎలాంటి గెస్ట్స్ వస్తారో .. ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.

మొదటి సీజన్ స్టార్ హీరోలు , హీరోయిన్స్ తో సక్సెస్ ఫుల్ గా 10 ఎపిసోడ్స్ తో ముగిసింది. ఇక రెండవ సీజన్ లో మూవీ స్టార్స్ తో పాటు.. పొలిటీషియన్స్ ను కూడా టాక్ షో లో పార్టిసిపేట్ చేశారు. ఈ సీజన్ కూడా విజయవంతంగా 10 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పడు ముచ్చటగా మూడో సీజన్.. ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో.. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక మరో వైపు తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 3. ఇలా బాలకృష్ణ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు . మరి అన్‌స్టాపబుల్ సీజన్ 3 అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.