iDreamPost
android-app
ios-app

ట్వీట్స్ చూసే అర్ధం చేసుకోవాల్సింది.. వీళ్ల సంఖ్య మారుతుందని!

  • Author ajaykrishna Published - 03:21 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Published - 03:21 PM, Sat - 16 September 23
ట్వీట్స్ చూసే అర్ధం చేసుకోవాల్సింది.. వీళ్ల సంఖ్య మారుతుందని!

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది హీరోలు, దర్శకుల గురించి కాదు. హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి. అవును.. ఇండస్ట్రీని ఓవైపు నుండి తన మ్యూజిక్ తో షేక్ చేసేస్తున్నాడు అనిరుధ్. ఇప్పుడు అనిరుధ్ తో వర్క్ చేయాలని చాలామంది స్టార్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అలా అనిరుధ్ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్స్ లో అల్లు అర్జున్ ఒకరు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే.. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ దేశాలు దాటి విస్తరించింది.

కట్ చేస్తే.. పుష్ప సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. దీంతో మరోసారి బన్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. పుష్ప 2 తర్వాత బన్నీ ఏ సినిమా చేస్తాడో.. ఆ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. అయితే.. పుష్ప 2 తర్వాత బన్నీ.. తనకు మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తో నాలుగో సినిమా చేయనున్నాడట. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానే వచ్చింది. మరోవైపు బన్నీ సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా ఓకే చేశాడు. ఇవి రెండే కాకుండా.. తాజాగా జవాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అట్లీతో ఓ సినిమా లైనప్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇటీవల బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలన్నీ అనిరుధ్ మ్యూజిక్ నుండి వచ్చాయి. గతేడాది విక్రమ్, డాన్, తిరు, బీస్ట్ లాంటి హిట్స్ తో పాటు.. ఈ ఏడాది జైలర్, జవాన్ లతో ఊపేశాడు. దీంతో అనిరుధ్ నుండి నెక్స్ట్ లియో వస్తోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. అనిరుధ్ తో రెండు ప్రాజెక్ట్స్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. త్రివిక్రమ్, అట్లీ.. ఈ రెండు ప్రాజెక్ట్స్ కి అనిరుధ్ ని కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తున్నాడట. ఎందుకంటే.. రీసెంట్ గా జవాన్ సక్సెస్ గురించి ట్వీట్ చేస్తూ.. నాకు కూడా గ్రేట్ సాంగ్స్ ఇవ్వాలి అని అనిరుధ్ ని అడిగాడు బన్నీ. దానికి అనిరుధ్ కూడా తప్పకుండా అనేశాడు. అయితే.. వీరి ట్వీట్స్ చూసి అట్లీ ప్రాజెక్ట్ ఒకటే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ.. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి కూడా అనిరుధ్ నే తీసుకుంటున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్స్ సంఖ్య ఒకటి నుండి రెండు అయ్యిందని మాట్లాడుకుంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరి వీరి కాంబో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet