iDreamPost
android-app
ios-app

అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

  • Published Feb 17, 2024 | 11:36 AM Updated Updated Feb 17, 2024 | 11:36 AM

ఇప్పుడు అందరు పాన్ ఇండియా ఫిల్మ్స్ తీస్తుంటే .. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ మాత్రం..తన సినిమా పాన్ ఇండియా ప్రాబ్లమ్ గురించి అంటూ.. వింటేజ్ టైటిల్ తో.. ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడు అందరు పాన్ ఇండియా ఫిల్మ్స్ తీస్తుంటే .. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ మాత్రం..తన సినిమా పాన్ ఇండియా ప్రాబ్లమ్ గురించి అంటూ.. వింటేజ్ టైటిల్ తో.. ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.

  • Published Feb 17, 2024 | 11:36 AMUpdated Feb 17, 2024 | 11:36 AM
అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

తెలుగు ఇండస్ట్రీలో తనదైన శైలిలో తెర పైన కామెడీ కమ్ సీరియస్ యాక్షన్ ను పండించడంలో.. ముందుండే హీరో అల్లరి నరేష్. అప్పట్లో హాస్య పరమైన కథలనే ఎక్కువగా ఎంచుకుంటూ ఉండేవాడు ఈ హీరో. అయితే, గత కొంతకాలంగా అల్లరి నరేష్ సీరియస్ సబ్జక్ట్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవి ఓ రకంగా ఆడియన్సును ఆకట్టుకుంటున్నాయి కానీ, ఎంతైన అల్లరి నరేష్ పండించే కామెడీ వేరుగా ఉంటుంది. దాదాపు అందరు అల్లరి నరేష్ నుంచి ఈ తరహా సినిమాలనే ఆసిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు మళ్ళీ అందరు వింటేజ్ అల్లరి నరేష్ ను చూసేలా .. సరికొత్త కథతో తిరిగి ఆడియన్సును నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు అందరు పాన్ ఇండియా ఫిల్మ్స్ తీస్తుంటే.. తమ సినిమా మాత్రం పాన్ ఇండియా ప్రాబ్లమ్స్ గురించి అంటూ .. ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టైటిల్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ సినిమా గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సుమారు ఇరవై రెండేళ్ల క్రితం అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ.. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ హీరోగా తనదైన శైలిలో కామెడీ పండించారు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో అల్లరి నరేష్ కామెడీ పండించాడని సిద్ధం అయిపోయారు. తాజాగా అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త సినిమాకు కూడా “ఆ ఒక్కటి అడక్కు” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంతో మల్లి అంకం దర్శకుడి గా తొలిసారి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్ కు తగినట్టే.. విడుదల చేసిన గ్లిమ్ప్స్ ను గమనిస్తే.. అందులో హీరోను.. తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అడుగుతారు. ఈ సందర్భంలో మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సమాధానం ఇస్తాడు అల్లరి నరేష్.

అయితే, ఈ సినిమా గ్లిమ్ప్స్ విడుదల అయిన వెంటనే.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రకరకాల మీమ్స్ వచ్చేస్తున్నాయి. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ కంటే పాన్ ఇండియా సమస్య మీద ఉన్న సినిమా అంటూ.. వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాలో . ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రలలో నటించనున్నారు. అయితే, “ఆ ఒక్కటి అడక్కు” అనే ఈ మూవీని మార్చి 22న థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా విడుదల తర్వాత ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి , అల్లరి నరేష్ నటిస్తున్న ఈ తాజ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş