iDreamPost
android-app
ios-app

Alia Bhatt : ట్రిపులార్ సీతకు కోపం వచ్చిందా

  • Published Mar 29, 2022 | 1:55 PM Updated Updated Mar 29, 2022 | 1:55 PM
Alia Bhatt : ట్రిపులార్ సీతకు కోపం వచ్చిందా

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఫస్ట్ ఫేజ్ లో విపరీతంగా పాల్గొన్న అలియా భట్ తీరా రిలీజయ్యాక సైలెంట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇన్స్ టా గ్రామ్ లో రాజమౌళిని అన్ ఫాలో చేయడం, సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టులు డిలీట్ చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. తన పాత్రను బాగా కుదించారన్న కోపంతోనే అలియా ఇలా చేసిందన్న మీడియా విశ్లేషణ నిజమనేలాగే తన ప్రవర్తన ఉంది. వాస్తవానికి జక్కన్న ఆమెకు స్టోరీ నెరేట్ చేసినదానికి ఫైనల్ అవుట్ ఫుట్ కి తేడా కనిపించిందట. దానికి తోడు షూట్ చేసిన భాగమంతా లేకుండా ఎడిటింగ్ లో తన క్యారెక్టర్ తగ్గిపోవడం పట్ల కూడా అలియా అలక బూనిందట.

కారణం ఏదైనా గంగూబాయ్ కటియావాడి లాంటి సూపర్ హిట్ తర్వాత తన నుంచి ఎంతో ఆశించిన అభిమానులకు ఆర్ఆర్ఆర్ లో మరీ చిన్న పాత్ర తరహాలో కనిపించడం నచ్చి ఉండకపోవచ్చు. మార్చి 25 కొత్త రిలీజ్ ప్రకటించాక అలియా కేవలం ఒక ప్రమోషన్ ఈవెంట్ లో మాత్రమే పాల్గొంది. అది కూడా అమీర్ ఖాన్ హాజరు వల్లేనని ముంబై టాక్. తనకు ప్రాధాన్యం తగ్గినప్పుడు తాను మాత్రం ఎందుకు పబ్లిసిటీలో భాగం కావాలన్నది అలియా ఆలోచనగా తోస్తోంది. అయితే పాత ఆర్ఆర్ఆర్ పోస్టులు డిలీట్ చేయకుండా అలాగే కొనసాగిస్తోంది. నిన్న 500 కోట్ల పోస్టర్ ని మాత్రమే ఫ్రెష్ గా ఇన్స్ టాలో పెట్టింది కానీ అంతకు మించి ఏమి చెప్పలేదు.

వాస్తవానికి అజయ్ దేవగన్ కు సైతం ఆర్ఆర్ఆర్ వల్ల గొప్పగా ఒరిగిందేమి లేదు. చరణ్ పాత్ర వెనుక స్ఫూర్తిగా తప్ప ఎగ్జైటింగ్ అనిపించే ఎపిసోడ్ ఏదీ డిజైన్ చేయలేదు. ఆమాటకొస్తే ఆ ఫ్లాష్ బ్యాకే కొంత మైనస్ అయ్యింది కూడా. అయినా ఇద్దరికీ ఫుల్ లెన్త్ సినిమాకు తగ్గ రెమ్యునరేషన్ ఇచ్చాక నిడివి పెరిగినా తగ్గినా పెద్దగా తేడా ఉండదు. అలియాకు 9 కోట్లు, అజయ్ దేవగన్ కు 35 కోట్ల దాకా పారితోషికం ముట్టిందట. నార్త్ ఆడియన్స్ కోసం మార్కెటింగ్ చేయడానికే వీళ్ళను తీసుకున్న రాజమౌళి ఇంతకు మించి వాడేందుకు మూడు గంటల నిడివిలో అవకాశం లేకుండా పోయింది. మరి ఈ అలకలు ఎలా అలియా అంటున్నారు ఫ్యాన్స్

Also Read : RRR Malli : సంచలనం సృష్టించిన చైల్డ్ ఆర్టిస్ట్ నేపథ్యం