iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి అక్షయ్ కుమార్ సూపర్ హిట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ అందులోనే!

  • Author singhj Updated - 12:02 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:02 PM, Fri - 3 November 23
ఓటీటీలోకి అక్షయ్ కుమార్ సూపర్ హిట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ అందులోనే!

అక్షయ్ కుమార్.. బాలీవుడ్​లో ఖాన్ త్రయం నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొని రేసులో నిలబడ్డ టాప్ హీరోల్లో ఒకరు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్​ల మాదిరిగా భారీగా అభిమాన గణం లేకపోయినా.. డిఫరెంట్ మూవీస్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నారాయన. ఒక జోనర్​ ఫిల్మ్స్​కే అక్షయ్ ఎప్పుడూ పరిమితం కాలేదు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ, దేశభక్తి సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. అక్కీ నుంచి ఒక మూవీ వస్తోందంటే అందులో పక్కాగా కొత్తదనం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ దీన్ని ఆయన నిలబెట్టుకోవడంలో ఈమధ్య కాలంలో ఫెయిల్ అవుతున్నారు.

అక్షయ్ కుమార్​కు ఈమధ్య ఆయన రేంజ్​కు తగ్గట్లుగా హిట్స్ పడట్లేదు. అయితే ఎట్టకేలకు ‘ఓఎంజీ 2’తో ఇటీవల మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఖిలాడీ స్టార్ దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్’ ఫిల్మ్ అప్పట్లో మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్​గా ఇటీవల ‘ఓ మై గాడ్ 2’ (ఓఎంజీ 2) రిలీజైంది. ఆగస్టు 11న ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకొని ఈ మూవీ హిట్ స్టేటస్ తీసుకుందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. అమిత్ రాయ్ డైరెక్షన్​లో రూపొందిన ‘ఓఎంజీ 2’లో పంకజ్ త్రిపాఠీ, యామీ గౌతమ్, గోవింద నామ్​దేవ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైపోయిందీ సినిమా.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో అక్టోబర్ 8వ తేదీ నుంచి ‘ఓఎంజీ 2’ స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నెట్​ఫ్లిక్స్ ఒక పోస్టర్​ను రిలీజ్ చేసింది. కథ విషయానికొస్తే.. కాంతి శరణ్ ముద్గల్ (పంకజ్ త్రిపాఠి) కొడుకు వివేక్ (ఆరుష్ వర్మ) అసభ్య ప్రవర్తన కారణంగా స్కూల్ నుంచి డిబార్ అవుతాడు. టాయ్​లెట్​లో అతడు చేసిన ఒక పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో తమ పరువు పోయిందని భావించిన ముద్గల్ ఫ్యామిలీ ఆ ఊరు విడిచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ అదే టైమ్​లో అక్కడికి వచ్చిన దేవదూత (అక్షయ్ కుమార్) వారికి సాయం చేస్తాడు. మరి.. దేవదూత మాటలు విని ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతడు కోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఇదీ చదవండి: సురేష్ కొండేటికి హీరో సిద్ధార్థ్ వార్నింగ్!