iDreamPost
android-app
ios-app

సురేష్ కొండేటికి హీరో సిద్ధార్థ్ వార్నింగ్.. పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి అంటూ..

  • Published Oct 03, 2023 | 8:06 PM Updated Updated Oct 03, 2023 | 8:06 PM
  • Published Oct 03, 2023 | 8:06 PMUpdated Oct 03, 2023 | 8:06 PM
సురేష్ కొండేటికి హీరో సిద్ధార్థ్ వార్నింగ్.. పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి అంటూ..

తాజాగా తమిళంలో దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో హీరో సిద్ధార్థ్ నటించిన చిత్తా మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్తా మూవీని తెలుగులో చిన్నాగా రిలీజ్ చేసేందుకు ఏషియన్ సినిమాస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే హైదరాబాద్ లో ఈ రోజు ప్రేస్ మీట్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న హీరో సిద్ధార్థ్ సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రశ్నలు పద్దతిగా అడగమన్నారంటూ సురేష్ కొండేటికి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి హిట్ చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు హీరో సిద్థార్థ్. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా సిద్ధార్థ్ చిత్తా మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న క్రమంలో ప్రెస్ మీట్ లో సురేష్ కొండేటికి వార్నింగ్ ఇచ్చాడు. ప్రెస్ మీట్లలో హీరోహీరోయిన్లను, డైరెక్టర్లను వారి సినిమా గురించి, పర్సనల్ లైఫ్ గురించి, కెరీర్ గురించి ఇబ్బందికర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టే సురేష్ కొండేటికి నొప్పి తెలియకుండా వార్నింగ్ ఇచ్చాడు హీరో సిద్ధార్థ్.

ప్రెస్ మీట్‌లో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘సురేష్ కొండేటికి ఒక వార్నింగ్. మొత్తం ఇంటర్నెట్ నీకొక వార్నింగ్ ఇవ్వమంది. ఆయన్ని పిలుస్తున్నామంటే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా మైక్ పట్టుకుని, పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి.. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యత మీది కాదు.. నెక్ట్స్ టైమ్ సమాధానం చెప్పొద్దు అని నాకొక అడ్వైస్ ఇచ్చారు ఇంటర్నెట్‌లో. సురేష్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా.. అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పాను. ఇప్పుడిదంతా బ్యాక్ స్టోరీ తర్వాత ప్రశ్న అడగండి’ అంటూ సురేష్ కొండేటికి బిగ్ షాక్ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ ఇచ్చిన ఈ డిఫరెంట్ వార్నింగ్ కు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ తో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş