iDreamPost
android-app
ios-app

అఖిల్ ప్లాన్ నెక్ట్స్ లెవల్లో ఉంది.. ఒకటి కాదు ఏకంగా 3 సినిమాలు!

  • Published Jul 09, 2024 | 11:01 AM Updated Updated Jul 09, 2024 | 11:01 AM

Akhil Akkineni Planning To Make Back To Back Movies: అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు వచ్చిన గ్యాప్ ని వచ్చే నాలుగేళ్లకు సరిపడా ప్రాజెక్టులు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.

Akhil Akkineni Planning To Make Back To Back Movies: అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు వచ్చిన గ్యాప్ ని వచ్చే నాలుగేళ్లకు సరిపడా ప్రాజెక్టులు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.

  • Published Jul 09, 2024 | 11:01 AMUpdated Jul 09, 2024 | 11:01 AM
అఖిల్ ప్లాన్ నెక్ట్స్ లెవల్లో ఉంది.. ఒకటి కాదు ఏకంగా 3 సినిమాలు!

అక్కినేని అఖిల్ అభిమానులు గత కొంతకాలంగా డీలాగా ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏజెంట్ సినిమా తర్వాత మళ్లీ అఖిల్ ని వెండితెర మీద చూసింది లేదు. అప్పుడప్పుడు ఎయిర్ పోర్టు నుంచి వచ్చే విజువల్స్ చూసి ఆనంద పడ్డారు. కానీ, అఖిల్ నుంచి కొత్త సినిమా లాంఛింగ్ పై ఎలాంటి వార్తలు రాలేదు. చాలా మంది అఖిల్ కు సలహాలు, సూచనలు, హితబోద కూడా చేశారు. ఫ్లాపులు వస్తే ఆగిపోవాల్సిన అవసరం లేదు అంటూ చాలా పెద్ద పోస్టులు కూడా పెట్టారు. అయితే ఇదంతా అఖిల్ చేస్తున్న జాప్యం కాదంట. యూవీ క్రియేషన్స్ వల్ల వచ్చిన గ్యాప్ అని చెబుతున్నారు. అంటే అఖిల్ గ్యాప్ తీసుకోలేదు.. గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయడానికి ఏకంగా 3 సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

అక్కినేని అఖిల్ కు టాలీవుడ్ లో ఒక మంచి గుర్తింపు ఉంది. అఖిల్ బ్లాక్ బస్టర్ కొడితే చూడాలి అని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సగటు సినిమా అభిమాని కోరుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో అఖిల్ మాత్రం సినిమాలు చేయకుండా ఇండస్ట్రీకి కాస్త డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ విషంలోనే అభిమానులు కాస్త కంగారు పడ్డారు. ఏజెంట్ రిజల్ట్ తో డీలా పడిపోయాడు అని అంతా భావించారు. కానీ, ఇదంతా కావాలని తీసుకున్న గ్యాప్ కాదు అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇక నుంచి తన అభిమానులను వరుస సినిమాలతో అలరించేందుకు అఖిల్ రెడీ అయిపోతున్నాడు అని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్లను కూడా సెలక్ట్ చేసుకుని వెయిట్ చేస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ డైరెక్టర్ల పేర్లు వింటే.. అఖిల్ ఖాతాలో వరుస విజయాలు ఖాయం అని మీరు కూడా ఒప్పుకుంటారు.

అయితే అఖిల్ ఇన్ని రోజులు సమయం కేటాయించింది.. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా మేకోవర్ కోసం అని చెబుతున్నారు. ఈ మూవీతో అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. త్వరలోనే గ్రాండ్ గా ఈ మూవీని లాంఛ్ చేస్తారు. దీని తర్వాత ఇంకో రెండు సినిమాలను అఖిల్ రెడీ చేస్తున్నాడు. మొదట సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో చేబోయేదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ డైరెక్టర్ వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో తన సత్తా చాటాడు.

ఇప్పుడు అఖిల్ కోసం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో కథ చెప్పడంతో అటు నాగార్జునకు కూడా నచ్చడంతో ఓకే చెప్పారట. ఆ తర్వాత.. ఏ మాయ చేశావే సినిమాతో అన్న నాగ చైతన్యకు బ్లాక్ బస్టర్ అందించిన గౌతమ్ వాసుదేవ మీనన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్. కాకపోతే ఈ ప్రాజెక్టుకు మాత్రం కాస్త సమయం పడుతుంది అంటున్నారు. ఇలా వచ్చే మూడు నాలుగు సంవత్సరాలకు సరిపడా అఖిల్ ప్రాజెక్టులను రెడీ చేసుకుంటున్నాడు. ఇన్నాళ్లు వచ్చిన గ్యాప్.. ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఇంక ఫుల్ స్టాప్ పడినట్లే అని చెబుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet