Nagendra Kumar
కొన్ని చిత్రాలు భారీ హిట్ ను సాధించిన తరువాత.. ఆ చిత్రాలకు ఏ సంస్థ అయితే, డిస్ట్రిబ్యూట్ చేసిందో.. అదే సంస్థ మరొక సినిమాకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంకా ఆ సినిమా హిట్ కాయం అని నమ్ముతుంటారు. ఇలా తాజాగా సాలార్ సినిమా.. విడుదలకు సిద్ధంగా ఉన్న మరో సినిమా డిస్ట్రిబ్యూషన్ కు ఉదాహరణ అయింది.
కొన్ని చిత్రాలు భారీ హిట్ ను సాధించిన తరువాత.. ఆ చిత్రాలకు ఏ సంస్థ అయితే, డిస్ట్రిబ్యూట్ చేసిందో.. అదే సంస్థ మరొక సినిమాకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంకా ఆ సినిమా హిట్ కాయం అని నమ్ముతుంటారు. ఇలా తాజాగా సాలార్ సినిమా.. విడుదలకు సిద్ధంగా ఉన్న మరో సినిమా డిస్ట్రిబ్యూషన్ కు ఉదాహరణ అయింది.
Nagendra Kumar
కొన్ని సెంటిమెంట్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సలార్ సెంటిమెంట్ ఇప్పుడు హనుమాన్ సినిమాకి కలిసొచ్చింది. సలార్ రిలీజై కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. ఈ సినిమాని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అంత పెద్ద హిట్ కొట్టిన అదే సంస్థ ఇప్పుడు హనుమాన్ సినిమాని కూడా పంపిణీ చేయడంతో హనుమాన్ చిత్రానికి తిరుగులేని క్రేజ్ వచ్చేసింది.
ఈ మథ్యనే హనుమాన్ ట్రైలర్ రిలీజై హనుమాన్ కి ఊహించని డిమాండ్ ని క్రియేట్ చేసింది. నిజంగానే ట్రైలర్ చూస్తే భలే ధ్రిల్ అయ్యే విధంగా ఉండడంతో హనుమాన్ రికార్డు క్రియేట్ చేస్తుందనే అంచనాలు చెలరేగాయి. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా తొలికాంబినేషన్లో వస్తున్న హనుమాన్ నిజానికి ప్రారంభం నుంచి కూడా సున్నితమైన గుర్తింపుని అందుకుంటూ వస్తోంది. ఎక్కడా శబ్దం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఒక్కసారిగా ట్రైలర్ వచ్చి పడగానే కళ్ళు తిరిగే ఎఫెక్ట్ క్రియేట్ అయింది.
ఇప్పుడు హనుమాన్ సినిమా నైజాం రైట్స్ ని మైత్రీ మూవీమేకర్స్ చాలా ఎక్సైటింగ్ ఫిగర్ 7.2 కోట్లకి గానూ తీసుకున్నారు. సక్సెస్ ట్రాక్ లో పరిగెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ సలార్ తో పెద్ద హిట్టే కొట్టేశారు నిన్నటి వరకూ కూడా సలార్ ఫీవర్ ఏమాత్రం తగ్గకుండా ముందుకు దూసుకువెళ్తోంది. తాజాగా హనుమాన్ రైట్స్ కూడా నైజాంకి గానూ మైత్రీ సంస్థ తీసుకుందనగానే ట్రేడ్ లో సడన్ గా హనుమాన్ రేంజ్ మారిపోయింది. విడుదలకి మునుపే హనుమాన్ పెద్ద హిట్ అన్న టాక్ మొదలైంది.
మైత్రీ మూవీ మేకర్స్ అంటేనే ఇప్పుడు సంచలనంగా మారింది. వారి చేతుల మీదుగా హనుమాన్ నైజాంలో రిలీజ్ అవుతోందంటే సలార్ సెంటిమెంట్ ఈజీగా వర్కవుట్ అవుతుందనేది చాలా మంది అంచనా. హనుమాన్ ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి. కానీ హనుమంతుడు సెంటర్ క్యారెక్టర్ గా వచ్చిన సినిమాలు ఏవీ కూడా ఇంత వరకూ ట్రేడ్ ని గానీ, ప్రేక్షకులను గానీ నిరాశపరచలేదు.