iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: సీక్రెట్‌గా స్టార్ హీరోయిన్‌ని మూడో పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్!

  • Published Mar 27, 2024 | 12:52 PM Updated Updated Mar 27, 2024 | 1:00 PM

ప్రముఖ స్టార్ హీరో సిద్దార్థ్ మరోసారి పెళ్లి చేసుకున్నాడట. అత్యంత రహస్యంగా ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ప్రముఖ స్టార్ హీరో సిద్దార్థ్ మరోసారి పెళ్లి చేసుకున్నాడట. అత్యంత రహస్యంగా ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

  • Published Mar 27, 2024 | 12:52 PMUpdated Mar 27, 2024 | 1:00 PM
బ్రేకింగ్: సీక్రెట్‌గా స్టార్ హీరోయిన్‌ని మూడో పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్!

ప్రముఖ స్టార్ హీరో సిద్దార్థ్.. నటి అదితి రావు హైదరినీ వివాహం చేసుకున్నాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగా పురంలోని దేవాలయంలో అతి కొద్ది బంధువుల మధ్య ఈ వివాహం జరిగింది. కాగా, సిద్దార్థకు ఇది మూడో వివాహం కాగా, అదితికి రెండో వివాహం. గత కొన్నాళ్లుగా వీరిద్దరి రిలేషన్ షిప్స్‌లో ఉన్న సంగతి విదితమే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు సిద్దార్థ్. శంకర్ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. తక్కువ కాలంలోనే స్టార్ డమ్ చూశాడు. తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుస హిట్లు అందుకుని.. అమ్మాయిలకు డ్రీమ్ బాయ్‌గా మారిపోయాడు. నువ్వు వస్తానంటే.. నొనద్దంటానా, చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, అనగగనగా ఓ ధీరుడు, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, సంథింగ్ సంథింగ్, మహా సముద్రం వంటి చిత్రాల్లో మెరిశాడు.

గతంలో సిద్దార్థకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలుస్తోంది. 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఈ జంట 2007లో విడిపోయారు. ఆ తర్వాత నటి సమంతతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటి కన్నా ముందే మరో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, మహా సముద్రం సినిమాలో కో యాక్టర్ అయిన అదితీ రావ్ హైదరీతో ప్రేమలో పడ్డాడు. అప్పటి నుండి ఈ జంట.. రిలేషన్ షిప్స్‌లో ఉంది. పలుమార్లు కెమెరా కంటికి చిక్కారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కూడా తమ రిలేషన్ గురించి చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు.. గతంలో పెళ్లి వార్తలపై కూడా ఖండిస్తూ వచ్చారు ఈ ఇద్దరు. ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇక అదితీరావ్ హైదరీ విషయానికి వస్తే.. గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకోగా.. 2012లో విడిపోయింది ఈ జంట. సత్య దీప్ మిశ్రా గత ఏడాది ప్రముఖ డిజైనర్, నటినీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. అదితీ రావ్ హైదరీ.. హిందీ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సమ్మోహనం చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.  అంతరిక్షం, వి, మహా సముద్రం వంటి తెలుగు చిత్రాల్లో మెరిసింది. అలాగే చెలియా, హై సినామికా వంటి డబ్బింగ్ మూవీలతోనూ పలకరించింది ఈ తెలుగు బ్యూటీ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom