iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటికి ప్రమాదం.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి!

ప్రముఖ నటికి ప్రమాదం.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి!

ప్రముఖ తమిళ సీరియల్‌, సినిమా నటి వైశాలి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బెలూన్స్‌ సకాలంలో తెరుచుకోవటంతో వైశాలి ప్రాణాలతో బయటపడ్డారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాలను స్వయంగా వైశాలినే బయటకు వెల్లడించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రెండు రోజుల క్రితం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ కారులో ప్రయాణిస్తున్నపుడు కచ్చితంగా సీటు బెల్ట్‌ పెట్టుకోండి.

నేను సీట్‌ బెల్ట్‌ ధరించటం కారణంగా కారు ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడ్డాను. కారు ప్రమాదానికి గురైనపుడు ఎయిర్‌ బెలూన్లు తెరుచుకుని ప్రమాదం తప్పింది. హైవేలో ప్రయాణిస్తున్నపుడు కచ్చితంగా సీట్‌ బెల్ట్‌ ధరించండి’’ అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆమె పోస్టు చేసిన వీడియోలో మెడకు గాయమైన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియో చూస్తున్న అభిమానులు, వైశాలి మిత్రులు.. ఆమె త్వరగా గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తన గాయానికి సంబంధించి వైశాలి శనివారం మరో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో తన గాయం త్వరగా తగ్గుతోందని పేర్కొన్నారు.

కాగా, వైశాలి పలు సీరియళ్లతో తమిళ నాటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియళ్లతో పాటు పలు సినిమాల్లోనూ ఆమె నటించారు. ఇటు, బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా తనదైన ముద్రవేసుకున్నారు. తనకంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. ఇక, వైశాలి సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు తెలియజేస్తూ ఉంటారు. మరి, నటి వైశాలి రోడ్డు ప్రమాదానికి గురి కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Thaniga (@_vaishalithaniga)