iDreamPost
android-app
ios-app

Video: హీరో శివ కార్తికేయన్‌తో కలిసి కుర్చీ మడతపెట్టిన శ్రీలీల!

  • Published Mar 24, 2024 | 6:43 PM Updated Updated Mar 25, 2024 | 10:10 AM

Srileela Dance: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లలో శ్రీలీల ఒకరు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ లో పాల్గొంది. కాగా, అక్కడ ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో కలిసి గుంటూరు కారం సినిమా కూర్చీ మడతపెట్టి సాంగ్ కు స్టెప్పులతో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Srileela Dance: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లలో శ్రీలీల ఒకరు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ లో పాల్గొంది. కాగా, అక్కడ ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో కలిసి గుంటూరు కారం సినిమా కూర్చీ మడతపెట్టి సాంగ్ కు స్టెప్పులతో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Mar 24, 2024 | 6:43 PMUpdated Mar 25, 2024 | 10:10 AM
Video: హీరో శివ కార్తికేయన్‌తో కలిసి కుర్చీ మడతపెట్టిన శ్రీలీల!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లలో ‘శ్రీలీల’ ఒకరు. ఇటీవలే ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా సంక్రాతి కానుకగా థియేటర్లలో విడుదల చేశారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోకపోయినా.. అందులో శ్రీలీల తన డ్యాన్స్ తో అదరగొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అంతేకాకుండా ఈ పాటకి ఇప్పటికే యూట్యూబ్‌లో అయితే 138 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి రికార్డులు సృష్టించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసిన ఈ పాటకి చిన్న నుంచి పెద్ద వరకు తమదైన స్టైల్ లో ఫరాపమెన్స్ అదరగొడుతున్నారు. అయితే తాజాగా ఈ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి శ్రీలీలా కోలీవుడ్ స్టార్ హీరోతో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా చెన్నైలోని తిరుచిరాపల్లిలో ‘అనంతరా కల్చరల్ ఫియస్టా 2024’ అంటూ ఓ ఈవెంట్ జరిగింది. దీనికి తమిళ హీరో శివ ‘కార్తికేయన్‌’తో పాటు శ్రీలీల కూడా ముఖ్య అతిథిగా వెళ్లింది. అక్కడ స్టేజ్ మీద హీరో శివ కార్తికేయన్ గురించి శ్రీలీల మాట్లాడుతూ ‘మీరు మా లాంటి ఎంతోమందికి పెద్ద ఇన్స్‌పిరేషన్ సార్. ఇక ఈ విషయం మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. అలాగే మీ జర్నీ కూడా ఎంతోమందికి ఒక నిదర్శణగా నిలిచింది. అలాగే ఈరోజు ఇలా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పింది. దీనికి శివ కార్తికేయన్ బదులిస్తూ ..’మీ మాటలకి చాలా థ్యాంక్స్ శ్రీలీల. మీరు చాలా గొప్పగా డ్యాన్స్ చేస్తున్నారు’ అంటూ చెప్పారు. దీంతో పక్కనే ఉన్న యాంకర్ ”అలా అయితే ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయాల్సిందే” అంటూ కోరింది. దీంతో వెంటనే శివ కార్తికేయన్ ‘అసలు ఎవరితో కలిసి డ్యాన్స్ చేయమంటున్నారు అర్థమవుతుందా అంటూ కామెడీ చేశారు. కానీ చివరికి అందరూ అడగడంతో శ్రీలీలతో కలిసి కుర్చీ మడతపెట్టి సాంగ్‌కి స్టెప్పులేశారు. అయితే మొదట శ్రీలీలతో స్టెప్పులేయడానికి శివ కార్తికేయన్ భయపడ్డారు. కానీ, తర్వాత మెల్లగా శ్రీలీలను చూసి ఫాలో అయి అలా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శ్రీలీల కెరీర్ విషయానికొస్తే.. గుంటూరు కారం సినిమా తర్వాత ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో యాక్ట్ చేస్తుంది. ఇక ఇది తప్ప మరి ఏ ఇతర ప్రాజెక్టులోను ఈమె పేరు వినిపించడం లేదు. అయితే ప్రస్తుతం MBBS పరీక్షలు ఉండటంతో వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది మరి, శ్రీలాల శివ కార్తికేయన్ కలిసి చేసిన కుర్చీ మడతపెట్టు డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom