iDreamPost
android-app
ios-app

దేవర మూవీలో మరో హీరోయిన్ గా మరాఠీ బ్యూటీ శృతి?

  • Published Aug 27, 2024 | 2:22 PM Updated Updated Aug 27, 2024 | 2:22 PM

Shruti Marathe in Devara Movie: అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది.

Shruti Marathe in Devara Movie: అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది.

  • Published Aug 27, 2024 | 2:22 PMUpdated Aug 27, 2024 | 2:22 PM
దేవర మూవీలో మరో హీరోయిన్ గా మరాఠీ బ్యూటీ శృతి?

ఇండియాతో పాటు వరల్డ్ గా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. అంటే సరిగ్గా ఇక నెల రోజులు మాత్రమే దేవర విడుదలకు సమయం ఉంది. ఈ క్రమంలో దేవర గురించి వచ్చే చిన్న అప్ డేట్ కోసం కూడా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

దేవర సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొద్ది సేపటి క్రితం విడుదలైన ఓ పోస్టర్..అందరికి సందేహాలకు మరింత బలం చేకూర్చింది. దేవర సినిమాలో ఎన్టీఆర్‌ తండ్రి, కొడుకులుగా కనిపిస్తారంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం నుంచి స్పష్టత రాలేదు. ఇది ఇలా ఉంటే.. ఈ మూవీలో జాన్వీతో పాటు మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేశారు.  మరాఠీ నటి శ్రుతి మరాఠే రెండో హీరోయిన్ గా ఎంచుకున్నారట. దేవర మూవీ నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది.

Marathi beauty as NTR's wife!

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతీ పలు విషయాలను ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ..”దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్  మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఈ బ్యూటీ చెప్పారు. కానీ,ఇప్పటివరకు దేవర మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో దేవర మేకర్స్ నుంచి శ్రుతి మరాఠే నటిస్తున్న విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో అసలు ఈ శృతి మరాతే ఎవరు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరనేది తెగ సెర్చ్ చేస్తున్నారు.

శ్రుతి మరాఠే విషయానికి వస్తే.. ఈ బ్యూటీ గుజరాత్ రాష్ట్రానికి చెందినది. ఆమె మరాఠ, హిందీ, తమిళ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. 2008లో సనై చౌఘడే అనే మరాఠ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. ఇక ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..శ్రుతి మరాతే కూడా రియాక్ట్‌ అయింది. మరి దేవరలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్‌ వస్తే మాత్రం..టాలీవుడ్లో ఫేమస్ అవ్వడం కన్ఫర్మ్. మరి..దేవర సినిమాలో ఈ పాత్ర గురించి క్లారిటీ రావాలంటే మరికాస్త సమయం ఆగాల్సిందే.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom