iDreamPost
android-app
ios-app

ఈ సర్కిల్లోని బ్యూటీ.. టాప్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి

  • Published Mar 22, 2024 | 4:15 PM Updated Updated Mar 22, 2024 | 4:15 PM

ఇండస్ట్రీలోకి స్టార్స్ గా ఎదగడానికి ముందు చిన్నచిన్న రోల్స్ చేస్తుంటారు కొందరు నటీ నటులు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. హీరో, హీరోయిన్లుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తమను తాము నిరూపించుకుంటారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కూడా అదే బాపతు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలోకి స్టార్స్ గా ఎదగడానికి ముందు చిన్నచిన్న రోల్స్ చేస్తుంటారు కొందరు నటీ నటులు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. హీరో, హీరోయిన్లుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తమను తాము నిరూపించుకుంటారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కూడా అదే బాపతు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

  • Published Mar 22, 2024 | 4:15 PMUpdated Mar 22, 2024 | 4:15 PM
ఈ సర్కిల్లోని బ్యూటీ.. టాప్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి

అందమైన రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి.. గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న చాలా మంది నటీనటులు..ఎంట్రీ సమయంలో సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్లే. త్రిష, సాయి పల్లవి, విజయ్ సేతుపతి, అనసూయ, స్వాతి, శివకార్తీకేయన్, సుడిగాలి సుధీర్, వైష్ణవి చైతన్య ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా ఉంటుంది. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ.. హీరో,హీరోయిన్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుని .. ఆ తర్వాత స్టార్, సూపర్ స్టార్ స్థాయికి ఎదుగుతున్నారు. ఇదిగో ఈ ఫోటోలో లైలా పక్కన నటిస్తున్న బ్యూటీని చూశారా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. కానీ ఓ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసింది. ఈ పిక్ ఆ చిత్రంలోనిదే. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలోని కొంత మంది యాక్టర్స్‌ను గుర్తు పట్టారు కదా.. స్నేహ భర్త ప్రసన్న, లైలా, రేవతి, లక్ష్మి కనిపిస్తున్నారు. ఈ చివర సర్కిల్లో ఉన్న చిన్నది.. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్. ఆమె యంగ్ హీరోలతో జతకడితే.. వారితో ఎఫైర్ అంటకట్టేయడం పరిపాటిగా సాగిపోయింది. వాటన్నిటికీ తన పనితనంతో చెక్ పెడుతూ ఉంటుంది ఈ తమిళ పొన్ను. 15 ఏళ్లకే నటిగా కెరీర్ స్టార్ చేసి..అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ నటిగా మారిపోయి.. సత్తా చాటింది. తెలుగు టైర్ 2, 3 హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన ఈ అమ్మడికి జూనియర్ శ్రియగా పేరుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరంటే.. రెజీనా కాసాండ్ర. ఈ పిక్ కాదల్ నాల్ ముదల్ అనే చిత్రంలోనిది. ఇందులో లైలా సోదరిగా లత అనే క్యారెక్టర్ చేసింది. 2005లో వచ్చిన ఈ మూవీ సపోర్టింగ్ పాత్రలో నటించింది.

Regina

2006లో హీరోయిన్ గా ఎంట్రీ..ఇప్పటికీ సక్సెస్ ఫుల్ నటిగా కొనసాగుతుండటం అంటే మామూలు విషయం కాదూ. తెలుగులో తొలి సినిమా శివ మనసులో శృతితో మంచి మార్కులు కొట్టేసింది. సందీప్ కిషన్‌తో రోటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్యతో , సాయి తేజ్‌తో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చేయడంతో వీరికి ఎఫైర్స్ అంటగట్టేసినా పెద్దగా పట్టించుకోలేదు.. తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. కొత్త జంట, పవర్, సౌఖ్యం, శౌర్య, జ్యో అచ్యుతానంద, శంకర, నక్షత్రం, బాలకృష్ణుడు వంటి చిత్రాలు ఆమెను స్టార్ హీరోయిన్ చేసేశాయి. ఇక ఆ మూవీలో ఆమె చేసిన నెగిటివ్ రోల్ టాప్ నాచ్. అడవి శేష్ ఎవరు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇటీవల కాలంలో లేడీ ఓరియంట్ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకునేందుకు సినిమాలు చేయగా.. ఇప్పుడు సెటిల్‌గా మూవీస్ చేస్తోంది. శాకినీ,డాకినీ, నేనేనా వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. హిందీ ఇండస్ట్రీల్లోకి కూడా అడుగుపెట్టింది రెజీనా. ఏక్ లడఖీ కో ధోఖా తో యైసా లగాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందం.. సెక్షన్ 108లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఉత్సవం అనే తెలుగు చిత్రంతో పాటు విదా ముర్చి, బోర్డర్, ప్లాష్ బ్యాక్ వంటి తమిళ్ చిత్రాలున్నాయి. మొత్తానికి సుమారు 20 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తుంది రెజీనా కాసాండ్రా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet