iDreamPost
android-app
ios-app

కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా…?

  • Published Jun 03, 2024 | 5:47 PM Updated Updated Jun 03, 2024 | 5:47 PM

ఇదిగో ఈ ఫోటోలో కృష్ణ వేషధారణలో ఉన్న ఈ నటి ఎవరో చెప్పగలరా.. ఆమె ఒకప్పటి క్రేజీ బ్యూటీ. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. తెరపై ఆమె కనిపిస్తే ఈలలు వేయాల్సిందే. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఇదిగో ఈ ఫోటోలో కృష్ణ వేషధారణలో ఉన్న ఈ నటి ఎవరో చెప్పగలరా.. ఆమె ఒకప్పటి క్రేజీ బ్యూటీ. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. తెరపై ఆమె కనిపిస్తే ఈలలు వేయాల్సిందే. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Jun 03, 2024 | 5:47 PMUpdated Jun 03, 2024 | 5:47 PM
కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా…?

చిన్నప్పుడు అమ్మ.. తమ పిల్లలకు వివిధ వేషధారణలు వేయించి.. ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. అదో సరదా ఆమెకు. అవి తర్వాతి కాలంలో అందమైన జ్ఞాపకాలు. ఆడ పిల్లలకైతే గోపికమ్మ లేదా ఇందిరా గాంధీ వేషాలు వేసి ఫోటో స్టూడియోకు తీసుకెళ్లి పిక్స్ తీయించేవారు తల్లులు. లేదంటే.. సమ్మర్ వస్తే చాలు మల్లెపూలు కొని.. ఓ సవరం తీసుకు వచ్చి.. పూల జడ వేసి మురిసిపోయే వాళ్లు. ఇక మగ పిల్లలు అయితే.. గాంధీజీ లేదా సుభాష్ చంద్రబోస్, నేతాజీ వేషధారణలు వేయించేవారు. ఇదిగో ఈ ఫోటోలోని కృష్ణుడి వేషధారణలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో చెప్పగలరా.. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి.. టాప్ వన్ స్థానంలో నిలిచింది.

80వ దశకంలో ఆమె ఒక క్రేజ్. అప్పటి కుర్రకారుకు కూడా ఆమె ఫేవరేట్ హీరోయిన్. ఆమె తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో ఈలలు, గోలలు చేసేవారు. హీరోలతో సమానంగా పాపులారిటీ సాధించిన ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవికి, బాలయ్యలకు మంచి ఫ్రెండ్. ఇంతకు ఆమె ఎవరంటే.. అందాల తారామణి రాధ. ఈ కృష్ణుడి గెటప్‌లో ఉన్నది ఆమెనే. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ పరిశ్రమలో వర్క్ చేసింది రాధ. 1981 నుండి 1991 వరకు ఈ ఇండస్ట్రీలను నమిలి అవతలేసింది. ఇక ఆమె డ్యాన్సులకు ఫిదా కానీ వారుండరు. చిరంజీవికి తగ్గ జోడీగా పేరు పడింది. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే.. సూపర్ డూపర్ హిట్. కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి పాత తరం నటులతో పాటు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో జతకట్టింది.

కేరళలో పుట్టిన రాధ.. అసలు పేరు ఉదయ చంద్రిక. ఆమె సోదరి అంబిక కూడా నటి అన్న సంగతి విదితమే. దశాబ్ద కాలం పాటు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన బ్యూటీ.. 1991లో ప్రముఖ వ్యాపార వేత్త రాజశేఖర్ నాయర్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. కార్తీక నాయర్, తులసీ నాయర్, విఘ్నేష్ నాయర్. కార్తీక తెలుగులో మంచి సినిమాలు చేసింది. ఇటీవల ఆమె కూడా పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. ఇక రాధ ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో పలు షోల్లో జడ్జిగా వ్యవహరిస్తోంది. సూపర్ సింగ్ సీజన్, జోడీ నంబర్, సూపర్ క్వీన్, బీబీ జోడీ, కుకు విత్ కోమలి వంటి టీవీ షోలకు జడ్జిగా వచ్చి అలరిస్తోంది బ్యూటీఫుల్ యాక్ట్రెస్ రాధ. ప్రస్తుతం ఆమె సినిమాల జోలికి వెళ్లడం లేదు. కేవలం టీవీ షోలో కనిపిస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom