iDreamPost
android-app
ios-app

స్విమ్​సూట్​లో గ్లామర్ ట్రీట్ చేస్తున్న.. ఈ బ్యూటీ క్వీన్​ను గుర్తుపట్టండి చూద్దాం!

  • Author singhj Published - 04:52 PM, Tue - 11 July 23
  • Author singhj Published - 04:52 PM, Tue - 11 July 23
స్విమ్​సూట్​లో గ్లామర్ ట్రీట్ చేస్తున్న.. ఈ బ్యూటీ క్వీన్​ను గుర్తుపట్టండి చూద్దాం!

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా యాక్టింగ్ కెరీర్​ను నిర్మించుకోవడం చాలా కష్టం అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. నటించే టాలెంట్​తో పాటు కాసింత లక్ కూడా కలిసొస్తేనే సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కుతాయి. అలాగే వచ్చిన ఛాన్స్​ను ఉపయోగించుకొని కెరీర్​ను చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అయితే కొందరు నటులు మాత్రం ఇందులో ఫెయిల్ అవుతారు. నటించే సత్తా ఉన్నా ఛాన్సులు దొరక్క ఫేడవుట్ అయిపోతారు. ఇకపోతే, ప్రముఖ నటి పూజా రామచంద్రన్ గురించి తెలిసిందే. ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది.

‘స్వామి రారా’ చిత్రంతో తెలుగు నాట మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు పూజా రామచంద్రన్. ఆ తర్వాత అడపాదడపా పలు మూవీస్​లో కనిపించినా అంత పేరు మాత్రం రాలేదు. ‘స్వామి రారా’ లాంటి మరో హిట్ ఫిల్మ్ పడి ఉంటే ఆమె కెరీర్ వేరేలా ఉండేదమో! ఇక, ఆ తర్వాత ‘బిగ్​బాస్’ షోలో కనిపించారు పూజ. కానీ బిగ్​బాస్ హౌస్​లో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజను ఆడియెన్స్ వెంటనే బయటకు పంపించేశారు. కౌశల్ ఆర్మీ దెబ్బకు బలైన వారిలో ఆమె కూడా ఒకరు. అలా బిగ్​బాస్​ హౌస్ నుంచి తక్కువ టైమ్​లోనే బయటకు వచ్చేసినా ఉన్నంతలో తన మార్క్​ను వేశారు పూజ. మూవీ ఛాన్సులు లేక సతమతమవుతున్న పూజా రామచంద్రన్​కు బిగ్​బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం అంతగా హెల్ప్ కాలేదు. అయితే సోషల్ మీడియాలో ఆమె పేరు మాత్రం బాగా మార్మోగిపోయింది.

ఇక, భర్త జాన్ కొక్కెన్​తో కలసి పూజా రామచంద్రన్ చేసే ఫొటో షూట్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ముఖ్యంగా వెకేషన్స్​లో ఆమె పొట్టి బట్టలు వేసుకొని హంగామా చేస్తుంటారు. ఈ మధ్యే ఆమె తల్లైన సంగతి తెలిసిందే. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చారు. అయితే డెలివరీ తర్వాత ఏ మహిళైనా కాస్త బొద్దుగా మారడం సహజమే. పూజ శరీరంలోనూ ఇలాగే మార్పులు వచ్చాయి. దీంతో మునుపటిలా సన్నగా, అందంగా మారేందుకు ఆమె తెగ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె స్విమ్​సూట్​లో దర్శనమిచ్చారు. అయితే ఈ ఫొటోల్లో ఆమె కాస్త లావుగా కనిపించారు. ముఖం కూడా గుర్తుపట్టనంతగా మారిపోయింది. దీనిపై పూజా రామచంద్రన్ స్పందిస్తూ.. తన బలాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నానని చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş