iDreamPost
android-app
ios-app

హీరోయిన్ పూజా హెగ్డేకు గాయం.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
హీరోయిన్ పూజా హెగ్డేకు గాయం.. వైరల్ అవుతున్న ఫొటోలు!

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల తర్వాత అంత పాపులారిటీ ఉండేది హీరోయిన్లకే. కొందరు కథానాయికలైతే హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కళ్లు తిప్పుకోనివ్వని అందం, అద్భుతంగా నటించగల, డ్యాన్సులు చేయగల టాలెంట్, ఎక్స్​ప్రెషన్స్​తో కట్టిపడేసే ప్రతిభ ఉంటే ఇక వారికి తిరుగే ఉండదు. అలాంటి వారితో సినిమాలు తీసేందుకు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉత్సాహం చూపిస్తారు. అడిగినంత రెమ్యూనరేషన్ కూడా ఇస్తుంటారు. అందుకే కొందరు హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికాలు అందుకుంటున్నారు. అలా కథానాయకుల స్థాయిలో ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరని చెప్పొచ్చు.

ఒక్కో హిట్​తో టాలీవుడ్​లో టాప్ పొజిషన్​కు చేరుకున్నారు పూజా హెగ్డే. వరుసగా విజయాలు రావడంతో ఈ బుట్టబొమ్మ తమ సినిమాలో ఉంటే హిట్ గ్యారెంటీ అని అందరూ అనుకునేవారు. అందుకే ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు తగ్గాయని తెలుస్తోంది. డేట్స్ ఇష్యూ వల్ల ‘గుంటూరు కారం’ నుంచి ఆమెను తప్పించారని తెలిసింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్​’లో అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్సయింది. ఇక్కడ ఆఫర్లు దూరమవ్వడంతో బాలీవుడ్​లో పూజ బిజీ అయిపోయారు. తెలుగులోనైతే ఆమె కొత్త సినిమాలేమీ చేయడం లేదు. పలు చిత్రాల్లో ఆమెకు ఛాన్సులు వచ్చాయని అంటున్నారు. కానీ దీనిపై క్లారిటీ లేదు.

Pooja hegde injured

ఇదిలా ఉంటే.. పూజా హెగ్డేకు గాయమైందని తెలుస్తోంది. తాను గాయపడినట్లు ఒక ఫొటోతో చెప్పుకొచ్చారు పూజా హెగ్డే. ఒకప్పటిలా కాదు ఇప్పుడు హీరోయిన్లు అంటే గ్లామర్ షోతో పాటు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటివి కూడా చేయాల్సి వస్తోంది. క్యారెక్టర్​లో ఒదిగిపోయేందుకు నటనతో పాటు యాక్షన్ స్టంట్స్​ను కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు పూజ కూడా అలాగే బాక్సింగ్ సాధన చేస్తూ మోకాలికి దెబ్బలు తగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్ స్టోరీస్​లో పోస్ట్ చేశారు బుట్టబొమ్మ. పూజ మోకాలికి గాయమైన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదీ చదవండి: స్టార్ హీరో రణ్​బీర్​కు ED సమన్లు!

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş