iDreamPost

ఆన్‌లైన్ గేమింగ్ కేసు.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు

ఆన్‌లైన్ గేమింగ్ కేసు.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు

నటుడు రణ్‌బీర్ కపూర్ కు ఈడీ షాకిచ్చింది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6న ఈడీ ముందు హాజరు కావాలని రణ్‌బీర్ కపూర్‌ని కోరింది. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవస్థాపకులు సౌరభ్ చంద్రకర్ మరియు రవి ఉప్పల్‌. వీరు దుబాయ్ లో ఉంటూ భారత్ లో బెట్టిగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రణబీర్ కపూర్ మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశాడు.

అయితే చంద్రకర్ వివాహానికి రణ్‌బీర్ కపూర్‌తో పాటు, టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం మరియు రహత్ ఫతే అలీ ఖాన్ వంటి ప్రముఖులు దుబాయ్‌లో సౌరభ్ చంద్రకర్ వివాహానికి హాజరయ్యారు. ఆ వివాహానికి రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ పెళ్లికి హాజరైన నటులపై దృష్టి సారించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్, మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లకు సంబంధించి ముంబై, కోల్‌కతా, భోపాల్ వంటి పలు నగరాల్లో గతంలో ఈడీ దాడులు నిర్వహించింది. కేంద్ర ఏజెన్సీ తన విచారణలో ఈడీ రూ. 417 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

సౌరభ్ చంద్రకర్ మరియు రవి ఉప్పల్ భారతదేశంలో ఆన్‌లైన్ క్యాసినో మరియు బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కోసం యాప్ మరియు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ యాప్ భారతదేశంలో నిషేధించబడింది, అయితే వీరిద్దరూ అనేక ఇతర దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.సెంట్రల్ ఏజెన్సీ మరియు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆగస్టులో ఇద్దరు నిందితులపై లుక్ అవుట్ సర్క్యులర్‌లు జారీ చేశారు మరియు ఇండియా టుడే నివేదిక ప్రకారం, సౌరభ్ చంద్రకర్ మరియు రవి ఉప్పల్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి