iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే..?

  • Published Sep 14, 2023 | 3:42 PM Updated Updated Sep 14, 2023 | 3:42 PM
  • Published Sep 14, 2023 | 3:42 PMUpdated Sep 14, 2023 | 3:42 PM
పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే..?

సినీ పరిశ్రమలో వరుసగా పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. ఈ జూన్‌లోనే టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి విదితమే. అదే సమయంలో రూమర్డ్ కపుల్, మెగా వారసుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు నిశితార్థం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది ఆషాడం మొదలు కావడంతో పాటు అధిక శ్రావణం అంటూ రెండు నెలలు గడిచిపోయింది. ముహుర్తాలు లేకపోవడంతో వివాహాలకు కాస్త బ్రేకులు పడ్డాయి. నిజ శ్రావణంలో మళ్లీ పెళ్లి భాజాలు మోగాయి. తెలుగు, తమిళ నటుడు త్రిగుణ్.. నివేదితను ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇతడు కథ, పీఎస్వీ గరుడవేగ, డియర్ మేఘ, కొండా వంటి చిత్రాల్లో నటించాడు. తాజాగా తమిళ నటుడు అశోక్ సెల్వన్.. నటి కీర్తి పాండ్యన్ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇప్పుడు మరో నటి పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

మలయాళ నటి మీరానందన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కేరళలోని కొచ్చిలో మీరానందన్ నిశ్చితార్థం జరిగింది. ఆమె భర్త పేరు శ్రీజు.  అతడు లండన్ నివాసి. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఈ పెళ్లి కుదిరింది. ఆమె కోసం అతడు దుబాయ్ వెళ్లాడు. కొన్ని సార్లు కలుసుకున్నాక, తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఆ ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు మీరానందన్. మీరా నందన్ ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటిస్తోంది. అడపా దడపా తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో కనిపిస్తోంది. తెలుగులో జై బోలో తెలంగాణలో నటించింది. అలాగే జగపతి బాబు నటించిన హితుడు అనే మూవీలో కూడా కీలక పాత్రలో కనిపించింది.  ఓ షార్ట్ మూవీలో కూాడా మెరిసింది. మీరా మంచి గాయని కూడా, రేడియో జాకీగా పనిచేస్తున్నారు. 2014లో మీరా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే రేడియో జాకీగా పనిచేస్తూ.. సినిమాల్లో కూడా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by LOC – Lights On Creations (@lightsoncreations)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbettilt girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş