iDreamPost
android-app
ios-app

రాజమౌళి మూవీలో నటించాలన్నది నా కల: యంగ్ హీరోయిన్!

  • Published Jul 05, 2024 | 12:05 PM Updated Updated Jul 05, 2024 | 12:05 PM

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమేనే ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి. ఆయన సినిమాలో నటించేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఉంటారు. అలానే ఓ యంగ్ బ్యూటీ కూడా తన మనసులోని మాటను చెప్పింది.

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమేనే ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి. ఆయన సినిమాలో నటించేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఉంటారు. అలానే ఓ యంగ్ బ్యూటీ కూడా తన మనసులోని మాటను చెప్పింది.

  • Published Jul 05, 2024 | 12:05 PMUpdated Jul 05, 2024 | 12:05 PM
రాజమౌళి మూవీలో నటించాలన్నది నా కల: యంగ్ హీరోయిన్!

ప్రతి ఒక్కరి  ఏదో ఒక కల ఉంటుంది. అది నిరవేర్చుకునేందుకు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. సెలబ్రిటీలకు కూడా కొన్ని ప్రత్యేకమైన ఆశలు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విషయాలను బయటకు చెబుతుంటారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తన మనసులోని మాటలను చెప్పింది. రాజమౌళి సినిమాలో నటించాలన్నది తన కల అంటూ మనసులోని మాటలను చెప్పింది. ఇంతకీ ఆ  హీరోయిన్ ఎవరు, ఆ  వివరాలు ఏమిటో ఇప్పుడు  చూద్దాం…

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమేనే ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి. బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపించారు. భారతీయులకు కలగా మిగిలిన ఆస్కార్ అవార్డును ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా అందించాడు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసింది. సక్సెస్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఆయన సినిమాలో నటించేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఉంటారు. అంతేకాక మరెంతో మందికి ఆ మూవీ నటించడం ఓ డ్రీమ్.  అలానే  యంగ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కూడా తన మనస్సులోని మాటను  చెప్పింది.

ఈమె తాజాగా ‘తిరగబడర సామీ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. మాల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో మూవీ టీమ్ ముచ్చటించింది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది. తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌  అని తెలిపింది. ఆమె స్టడీస్‌ కోసం ముంబై వెళ్లి.. అక్కడ థియేటర్‌ ఆర్ట్స్‌లో చేరింది. తనకు తెలుగులో తొలి సినిమా ‘తిరగబడర సామీ అని తెలిపింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

అమ్మాయిలు సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకోవాలని తన క్యారెక్టర్‌ చెబుతుందని, తాను నిజ జీవితం కూడా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నానని తెలిపింది. లవ్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్‌… ఇలా అన్ని అంశాలు మిళితమైన  ‘తిరగబడరా సామీ’ మూవీ ఆడియన్స్ ను  అలరిస్తుందని బ్యూటీ తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తెలుగు పరిశ్రమ గురించి ఇంటర్నేషనల్ లెవల్ లో మాట్లాడుకుంటున్నారని తెలిపింది. ఇప్పుడు తెలుగులో తాను భాగమైనందుకు  సంతోషంగా ఉందని, రాజమౌళిగారి సినిమాలో నటించాలనేది తన కలని చెప్పింది. అదే విధంగా మణిరత్నంగారన్నా చాలా అభిమానమని తెలిపింది. హీరోల్లో మహేశ్‌బాబు, నాని, అడివి శేష్‌గార్లంటే ఇష్టమని తన మనసులోని మాటలను ఈ బ్యూటీ వ్యక్తం చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş