Venkateswarlu
నటి సర్జరీ చేయించుకుంటూ ఉండగా ఉన్నట్లుండి అనుకోని సంఘటన జరిగింది. దాని కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
నటి సర్జరీ చేయించుకుంటూ ఉండగా ఉన్నట్లుండి అనుకోని సంఘటన జరిగింది. దాని కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Venkateswarlu
సినిమా తారలకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నూటికి 90 శాతం ఆఫర్లు.. నటన కంటే.. ఎక్కువగా అందాన్ని చూసే వస్తాయిని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే నటీమణులు ఎక్కువగా సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు ఆ సర్జరీలే వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. సర్జరీలు వికటించి లోపాలుగా మారటమో.. ప్రాణాలు పోవటమో జరుగుతూ ఉంటుంది.
తాజాగా ఓ నటి సర్జరీ చేయించుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. సర్జరీ సందర్భంగా ఆమెకు నాలుగు సార్లు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. దీంతో ఆమె కన్నుమూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సావోపాలోకు చెందిన 29 ఏళ్ల లూనా ఆడ్రెడ్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే రానిస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే మరింత అందంగా కనిపించాలని ఆమె భావించారు. ఇందుకోసం కాస్మటిక్ సర్జరీలు చేయించుకోవడానికి సిద్ధం అయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆమెకు కాస్మటిక్ సర్జరీ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ సారి కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది.
వైద్యులు ఆమెకు సీఆర్‌పీ చేసి మామూలు స్థితికి తీసుకువచ్చారు. కొద్ది సేపటి తర్వాత వరుసగా మూడు సార్లు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. దీంతో ఆమెను రక్షించడానికి డాక్టర్లు ఎంతగానో ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ లూనా కన్నుమూశారు. లూనా మరణ వార్త చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఇక, సోషల్ మీడియా లూనా మరణం సంచలనంగా మారింది. కాస్మటిక్ సర్జరీలను ఆశ్రయించే వారికి హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, దేశంలోనూ అందం కోసం కాస్మటిక్ సర్జరీలను ఆశ్రయించిన.. ఆశ్రయిస్తున్న హీరోలు, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. శ్రీదేవీ, సమంత, శృతి హాసన్, జాన్వీ కపూర్ ఇలా చాలా మంది సర్జరీలు చేయించుకున్నారు. అయితే, బరువు తగ్గటం కోసం చేయించుకునే లైఫో సెక్షన్ కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో ప్రముఖ హీరోయిన్ ఆర్తీ ఆగర్వాల్ లైఫో సర్జరీ చేయించుకుంటూ మరణించారు. తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.
చేతనా రాజ్ అనే నటి కూడా కాస్మటిక్ సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయింది. లైఫో కారణంగా గుండె పోటు రావటం ప్రాణాలు కోల్పోవటం సాధారణంగా జరుగుతోంది. అయినప్పటికీ అందం కోసం సర్జరీలు చేయించుకునే వారి సంఖ్య తగ్గటం లేదు. హాలీవుడ్ సెలెబ్రిటీలు రెండు మూడు కంటే ఎక్కువ సార్లు సర్జరీలు చేయించుకుంటున్నారు. మరి, కాస్మటిక్ సర్జరీ వికటించి నటి లూనా ఆడ్రెడ్ మరణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.