P Krishna
Kangana Ranaut Competition: సినీ ఇండస్ట్రీలో రాణించిన నటీనటులు ఎంతోమంది రాజకీయాల్లో తమదైన మార్క్ చాటుకున్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది సినీ ప్రముఖులు పోటీ చేస్తున్నారు.
Kangana Ranaut Competition: సినీ ఇండస్ట్రీలో రాణించిన నటీనటులు ఎంతోమంది రాజకీయాల్లో తమదైన మార్క్ చాటుకున్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది సినీ ప్రముఖులు పోటీ చేస్తున్నారు.
P Krishna
దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ప్రజల మద్దతు కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. కొంతమంది సొంత పార్టీలు పెట్టి ముఖ్యమంత్రి పదవుల్లో కొనసారు. మరికొంతమంది సీనీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పత్తా లేకుండా పోయారు. త్వరలో దేశ వ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో పలువురు సినీ తారలు పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి, బాలీవుడ్ క్విన్ కంగనా రౌనత్ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. వివరాల్లోకి వెళితే..
సినిమాలపై ఇష్టంతో తన పదహారేళ్ల వయసులో ముంబైకి వచ్చి డైరెక్టర్ అరవింద్ గౌర్ వద్ద శిక్షణ తీసుకుంటూ మోడలింగ్ గా కెరీర్ మొదలు పెట్టింది కంగనా రౌనత్. 2006 థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సినీ ఇండస్ట్రీలో పెద్ద మనుషుల ముసుగులో ఉన్నవారు కాస్టింగ్ కౌచ్ కి పాల్పపడ్డారని సంచలన ఆరోపణలు చేసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు కంగనా అంటేనే సంచలనం అన్న స్థాయికి చేరుకుంది. నటిగానే కాదు.. దర్శకత్వం, నిర్మాణ రంగంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 2020 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కంగనా సిద్దమవుతున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కంగనా రౌనత్ త్వరలో రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆమె జయలలిత బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆమె పాత్ర గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నటించినట్లు పలు మార్లు చెప్పింది. ఈ క్రమంలోనే జయలలిత రాజకీయ జీవితం స్ఫూర్తిగా తీసుకొని ఆమె రాజకీయాల్లోకి అడుగు పట్టబోతుందా అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తుందట కమల దళం. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో తన రాజకీయ అరంగెట్రం గురించి కంగన ప్రస్తావించింది. శ్రీకృష్ణుడి ఆశిస్సులు ఉంటే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తా’ అని చెప్పిన విషయం తెలిసిందే.
My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of BJP has announced me as their Loksabha candidate from my birth place Himachal Pradesh, Mandi (constituency) I abide by the high…
— Kangana Ranaut (@KanganaTeam) March 24, 2024