iDreamPost
android-app
ios-app

ఈ గ్లామర్ బ్యూటీ.. ఇంతలా మారిపోయిందేమిటీ.. నిజంగా ఆమె అంటే నమ్మలేరు

  • Published Jun 01, 2024 | 3:05 PM Updated Updated Jun 01, 2024 | 3:05 PM

ఈ షోటోలో డీ గ్లామర్ పాత్రలో మెరుస్తోన్న బ్యూటీ ఎవరో చెప్పుకోండి. తెలుగు ఇండస్ట్రీతో పాటు కోలీవడ్ పరిశ్రమను తన అందచందాలతో కట్టిపడేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ షోటోలో డీ గ్లామర్ పాత్రలో మెరుస్తోన్న బ్యూటీ ఎవరో చెప్పుకోండి. తెలుగు ఇండస్ట్రీతో పాటు కోలీవడ్ పరిశ్రమను తన అందచందాలతో కట్టిపడేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Jun 01, 2024 | 3:05 PMUpdated Jun 01, 2024 | 3:05 PM
ఈ గ్లామర్ బ్యూటీ.. ఇంతలా మారిపోయిందేమిటీ.. నిజంగా  ఆమె అంటే నమ్మలేరు

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఒకలా.. సినిమాల్లో ఎస్టాబ్లిష్ అయ్యాక మరోలా మారిపోతుంటారు హీరోయిన్లు. ధరించే దుస్తుల నుండి ప్రతి విషయంలోనూ మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి. ఇదిగో ఈ ఫోటోలోని అమ్మాయి కూడా ఇదే బాపత్తు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తర్వాత హీరోయిన్‌గా అలరించి, ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారిపోయింది. తనకు నటిగా అవకాశం కల్పించిన హిందీలో, అలాగే కన్నడలో అడపాదడపా సినిమాలు చేసింది. పెళ్లైన తర్వాత కూడా బిజీగా అయ్యింది ఈ సౌందర్య రాశి. ఇప్పటికే 75 సినిమాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. వంద చిత్రాలు తీసే వైపుగా పరుగులు పెడుతుంది.

ఈ ఫోటోలో డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా.? తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్. ముక్కెకు ముక్కెర పెట్టి, కళ్లకు నిండైన కాటుకను అద్ది, నుదిటిన కుంకుమను సింగారించుకుని, చెవులకు జుంకాలు తొడుగుతున్న ఈ నటి పేరు చెబితే.. మిమ్మల్ని మీరు నమ్మలేరు కానీ సరికదా.. ఈ విషయం నిజమేనా అని మిమ్మల్ని మీరు గిల్లుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత అందంగా కనిపిస్తున్న ఆమె ఎవరంటే హన్సిక మొత్వానీ. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పుడు వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరిస్తోంది. హవా, కోయి మిల్ గయా, జాగో వంటి చిత్రాలతో బాలనటిగా మెప్పించిన హన్సిక..అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన దేశముదురు మూవీతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ సరసన కంత్రి, మస్కా, బిల్లా, జయభవ, సీతా రాముల కళ్యాణం లంకలో వంటి చిత్రాలు ఆమెను నిరాశ పరిచాయి. మెల్లిగా తమిళ ఇండస్ట్రీ వైపు కన్నేసింది హన్సిక. కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ తర్వాత తమిళ చిత్రాలకు పరిమితమైంది. అలాగే తెలుగులో వస్తున్న ఆఫర్లను వదులుకోలేదు అమ్మడు. పాండవులు పాండవులు తుమ్మెద, పవర్, లక్కున్నోడు, గౌతమ్ నంద వరకు హీరోల సరసన ఆడిపాడింది. అటు తమిళంలో ఒకానొక సమయంలో టాప్ చైర్ సొంతం చేసుకుంది. ఇటీవల లేడీ ఓటిరంయట్ చిత్రాలు చేస్తుంది. మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ చిత్రాలు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు రౌడీ బేబీ, గాంధారీ వంటి మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తుంది. .. ఇప్పుడు గాంధారి సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఈ మూవీలో హాన్సిక ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పిక్ అందులోనిదే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet