iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన దేవయానిని మోసం చేసింది ఎవరు..?

  • Published Oct 04, 2023 | 8:10 PM Updated Updated Oct 04, 2023 | 8:10 PM
స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన దేవయానిని మోసం చేసింది ఎవరు..?

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన నటి దేవయాని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది దేవయాని. తెలుగు లో పెద్దగా సక్సెస్ లు రాకపోవడంతో కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలోకి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన దేవయాని ప్రస్తుతం ఒక సామాన్య టీచర్ గా కొనసాగుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘సుస్వాగతం’. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన దేవయాని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు పడ్డ దేవయాని వివిధ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో దేవయానిపై కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అప్పట్లో ఓ హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. తమిళంలో దేవయాని ఎక్కువగా అజిత్, శరత్ కుమార్ లతో కలిసి నటించింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో ప్రేమాయనం నడిపించి తర్వాత మోసం చేశారని అప్పట్లో కోలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేశాయి.

తనపై వచ్చిన రూమర్స్ ని అప్పట్లో దేవయాని కొట్టిపడేసింది. నటిగా మంచి ఫామ్ లో ఉండగానే 2001 లో తమిళ దర్శరకుడు రాజ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇనియ, ప్రియాంక పుట్టారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పుట్టింటికి దూరంగా ఉంటూ వచ్చిందని టాక్. అంతేకాదు దేవయాని సంపాదించిన ఆస్తిలో చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ముంబైలో దేవయాని 16వ ఏటనే బాలీవుడ్ మూవీలోకి అడుగు పెట్టింది. దేవయాని కెరీర్ బిగినింగ్ లో అవకాశాల కోసం బెంగాళీ మూవీస్ లో రొమాంటిక్ సీన్లలో నటించిందట. బికీనీతో ఐటమ్ సాంగ్స్ లో కనిపించిందట. అలాంటి వేషాలు వేయడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదపడ్డాయని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్.

పెళ్లి తర్వాత సినిమాల్లో నటించలేదు దేవయాని. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బుల్లితెరపై దృష్టి సారించింది దేవయాని. రోజుకు లక్షరూపాయలు తీసుకొని ఆర్థికంగా మళ్లీ గాడిలో పడ్డారు. తమ వద్ద ఉన్న డబ్బుతో నిర్మాతగా మారి భర్త దర్శకత్వంలో కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. దీంతో మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. కొంతకాలం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డ దేవయాని ప్రస్తుతం ఓ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో ఉన్న చర్చ్ పార్క్ కాన్వెంట్ స్కూల్ లో నర్సరీ పిల్లలకు పాఠాటు చెబుతుంది దేవయాని. ఇటీవల ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ లాంటి చిత్రాల్లో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా సెలెక్టెడ్ పాత్రల్లోనే నటిస్తానని అంటున్నారు దేవయాని.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet