Dharani
ప్రముఖ నటుడు ఒకరు గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు..
ప్రముఖ నటుడు ఒకరు గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు..
Dharani
సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా సరే నిమిషాల వ్యవధిలో వైరల్ అవుతుంది. అలానే సెలబ్రిటీలు కూడా నిత్యం లైమ్‌లైట్‌లో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే ఫేడ్ అవుట్ అవుతారని వారికి తెలుసు. వెండితెర, బుల్లితెర మీద కనిపించినా, కనిపించకపోయినా సరే.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటారు. తమకు సంబంధించిన ఫొటోలు, వర్క్‌కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులకు చేరువగా ఉంటారు. ఇక ఎవరైనా సెలబ్రిటీ వరుసగా కొన్ని రోజులు మీడియా, సోషల్ మీడియాలో కనిపించకపోతే.. ఇక వారి గురించి రకరకకాల వార్తలు వస్తాయి. తాజాగా ఓ నటుడు నాలుగు రోజులుగా కనిపించకుండా పోయాడు. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలు..
ప్రముఖ నటుడు గురు చరణ్ సింగ్ కనిపించకుండా పోయాడు. దాదాపు నాలుగు రోజుల నుంచి అతడి ఆచూకీ గురించి ఎవరికి తెలియదు. దాంతో గురు చరణ్ సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రముఖ నటుడు ఇలా మిస్సింగ్ అవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ నటుడి వయసు 50 ఏళ్లు. అలాంటి వ్యక్తి ఇలా అనుమానాస్పద రీతిలో మిస్సింగ్ కావడం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. ఇక నటుడు గురుచరణ్ కుటుంబ సభ్యులు.. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
గురు చరణ్ సినిమాల విషయానికి వస్తే.. హిందీలో ‘తారక్ మెహతా కా ఉల్తా చష్మా’ అనే టీవీ సీరియల్‌లో సోధి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన గురు చరణ్.. గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఇతడి తండ్రి ఢిల్లీ పోలీసులని ఆశ్రయించాడు. ఫిర్యాదు ప్రకారం.. గురుచరణ్, సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లాడు. అయితే ముంబై వెళ్లాల్సిన గురుచరణ్.. అక్కడికి చేరుకోలేదు. అలా అని ఇంటికి కూడా తిరిగి రాలేదు. అతడి ఫోన్ కూడా కలవడం లేదని.. గత నాలుగు రోజులుగా అతడి ఆచూకీ లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ప్రస్తుతం గురుచరణ్ మానసిక పరిస్థితి సరిగానే ఉందని, తాము కూడా అతడి కోసం వెతికామని అతడి తండ్రి.. తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే సీరియల్‌లో నటిస్తున్న గురుచరణ్.. తన తండ్రికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా టీవీ షో నుంచి తప్పుకొన్నాడు. కుటుంబానికే తన పూర్తి సమయాన్ని కేటాయించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గత నాలుగు రోజులుగా అనుహ్యంగా కనిపించకుండా పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.