iDreamPost
android-app
ios-app

నటి కళ్యాణి మాజీ భర్త, ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్‌ మృతి!

  • Published Mar 11, 2024 | 2:50 PM Updated Updated Mar 11, 2024 | 8:52 PM

Surya Kiran Passed away: ప్రముఖ నటి కళ్యాణి మాజీ భర్త, ప్రముఖ దర్శకులు సూర్య కిరణ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో సోమవారం తుదిశ్వాస విడిచారు.

Surya Kiran Passed away: ప్రముఖ నటి కళ్యాణి మాజీ భర్త, ప్రముఖ దర్శకులు సూర్య కిరణ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో సోమవారం తుదిశ్వాస విడిచారు.

  • Published Mar 11, 2024 | 2:50 PMUpdated Mar 11, 2024 | 8:52 PM
నటి కళ్యాణి మాజీ భర్త, ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్‌ మృతి!

ఇటివల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, అనారోగ్య సమస్యలు లతో కొంతమంది ప్రముఖులు కన్నుమూస్తే.. ఇండస్ట్రీలో కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరికొంతమంది సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకులు సూర్య కిరణ్ కన్నమూశారు. దీంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త, ప్రముఖ దర్శకులు, కొరియోగ్రాపర్, నటులు సూర్య కిరణ్ సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన కామెర్ల వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అది మరింత ముదిరిపోవడంతో కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ వంటి చిత్రాలు తెరకెక్కించారు. కేరళాకు చెందిన సూర్య కిరణ్ మలాలీవుడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించారు. 1978 లో స్నేహిక్కన్ ఓరు పెన్ను మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కన్నడ, మలయాల, తెలుగు, తమిళ భాషల్లో నటించారు. 1986 లో చిరంజీవి నటించిన రాక్షసుడు మూవీలో నటించాడు.

ప్రముఖ నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. అప్పట్లో వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో తెగ కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. సూర్య కిరణ్ దర్శకత్వంలో కళ్యాణి పలు చిత్రాల్లో నటించింది. 2002 లో సత్యం చిత్రంతో తెలుగు లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగానే కాకుండా దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నెం 786, కొండవీటి దొంగ చిత్రాల్లో నటించారు. చిరంజీవితో పాటు కమల్ హాసన్, రజినీకాంత్, అమితాబ్ వంటి స్టార్ హీరోలతో సూర్య కిరణ్ నటించారు. మాస్టర్ సురేష్ పేరుతో 200 లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించి మెప్పించారు. అంతేకాదు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి బాబా భాస్కర్ తో ఆడిపాడారు. మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా రెండు నందీ అవార్డులు గెల్చుకున్నారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom