Venkateswarlu
ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు కన్నుమూస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సీఐడీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్, బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్ చనిపోయారు.
ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు కన్నుమూస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సీఐడీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్, బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్ చనిపోయారు.
Venkateswarlu
ఇండస్ట్రీలో వరుస విషాదాల పర్వం కొనసాగుతోంది. ఒకరి తర్వాత ఒకరు సినీ ప్రముఖులు చనిపోతున్నారు. కేవలం రెండు నెలల్లోనే దాదాపు పది మంది నటీ,నటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు చనిపోయారు. నవంబర్ నెలలో ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించారు. మధుమేహం, కిడ్నీల సమస్య, హృద్రోగంతో బాధపడుతున్న ఆయన అపోలోలో చేరారు. నవంబర్ 11న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంతకు ముందు మలయాళ ఇండస్ట్రీలో టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకుని మరణించారు.
కొద్దిరోజుల క్రితం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు చనిపోయారు. కర్ణన్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన మారి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారిముత్త అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ తర్వాత ప్రముఖ బహుభాషా సీనియర్ నటి సుబ్బలక్ష్మి మరణించారు. వయో భార సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 87 ఏళ్ల వయసులో ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. సుబ్బలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు.
డిసెంబర్ 8వ తారీఖున ప్రముఖ సీనియర్ నటి లీలావతి మరణించారు. గత కొంత కాలంగా వయోభార సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. లీలావతి కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించారు. అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, వీరితో పాటు సీఐడీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్, బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్.. మలయాళ యువ నటి లక్ష్మిక సజీవన్‌లు కూడా చనిపోయారు.
వీరి మరణాల నుంచి పరిశ్రమ తేరుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు రమారత్నం శంకరన్ చనిపోయారు. వయో భార సమస్యల కారణంగా 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విచారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. తమిళంలో ఈయన ఒరు ఖైదియిన్ డైరీ, పతిమూనామ్ నెంబర్ వీడు, అమరన్, చిన్న గౌండర్, సతి లీలావతి, కాదల్ కోట్టై, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1999లో వచ్చిన అలగార్ సామి సినిమాలో చివరగా నటించారు. తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. శంకరన్ మృతిపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
எனது ஆசிரியர்
இயக்குனர் திரு.ரா.சங்கரன்
சார் அவர்களின் மறைவு
வேதனை அளிக்கிறது.
அவரை இழந்து வாடும்
அவரது குடும்பத்தினருக்கு
ஆழ்ந்த இரங்கலைத்
தெரிவித்துக் கொள்கிறேன். pic.twitter.com/SJmO0dApeq— Bharathiraja (@offBharathiraja) December 14, 2023