iDreamPost
android-app
ios-app

మనసు మార్చుకున్న బ్యూటీ.. ఆ సీన్స్ కు పచ్చజెండా

  • Published Feb 29, 2024 | 4:10 PM Updated Updated Feb 29, 2024 | 4:10 PM

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తాజాగా తంత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అనన్యకు ఓ ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ నా మనసు మార్చకున్న అందుకే ఆ పని చేశా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తాజాగా తంత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అనన్యకు ఓ ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ నా మనసు మార్చకున్న అందుకే ఆ పని చేశా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Feb 29, 2024 | 4:10 PMUpdated Feb 29, 2024 | 4:10 PM
మనసు మార్చుకున్న బ్యూటీ.. ఆ సీన్స్ కు పచ్చజెండా

తెలుగమ్మాయి ‘అనన్య నాగళ్ల’. ప్రస్తుతం ఈ చిన్నదాని పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఇప్పు హీరోయిన్ గా ప్రధాన పాత్రల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే 2019లో వచ్చిన ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది అనన్య.ఆ సినిమాలో తన ఆద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని తర్వాత 2021లో సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం ‘ప్లే బ్యాక్‌’లో అన్యన మెరిసింది. కాగా, అదే సంవత్సరం హిందీలో ‘పింక్’ రీమేక్ , పవన్ కళ్యాణ్నటించిన ‘వకీల్ సాబ్‌’లో అవకాశం చేజిక్కించుకుంది.ఈ సినిమాతో ఈ అమ్మాడు దశ తిరిగిపోయింది. వరుస ఆఫర్స్ అనేవి ఈ బ్యూటీకి క్యూ కట్టాయి.ఇదిలా ఉంటే.. తాజాగా అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘తంత్ర’. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో అనన్యకు ఓ  ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ.. నా మనసు మార్చకున్న అందుకే ఆ పని చేశా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా అనన్య హీరోయిన్ గా ‘తంత్ర’ అనే సినిమాతో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయింది. ఈ సినిమాతో పాటు ‘పొట్టేల్’ అనే మూవీని కూడా పూర్తి చేసింది ఈ బ్యూటీ. అయితే, ఈ తంత్ర మూవీకి సంబంధించి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను తాజాగా మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనన్య కు పొట్టేల్ సినిమాలో ఉన్న ముద్దు సన్నివేశం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. అలాంటి సన్నివేశాలు కూడా ఈ తంత్ర సినిమాలో ఉంటాయా అని ఓ విలేఖరి ప్రశ్నించాడు.ఇందుకు అనన్య స్పందిస్తూ.. ‘ముద్దు సన్నివేశమనేది ఆ సినిమాకు చాలా అవసరం. అందుకని చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్లామర్, రోమాంటిక్ సీన్స్ తో పాటు హారర్ కూడా ఉందని అనన్య చెప్పింది. అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచనల్లో మార్పలు వస్తుంటాయి. ఆ మార్పు లేకపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నేను ఎలా ఉన్నా, ఎలా చేసినా నాకు సినిమాలో ఆవకాశాలు వస్తాయని అనుకున్నాను. అయితే, నటనలో రొమాంటిక్ సీన్లు కూడా ఓ భాగం అని అర్థం చేసుకోవడానికి కొంచెం టైమ్ పట్టింది’ అని అనన్య చెప్పుకొచ్చింది. అంటే దీని బట్టి సినిమాలో కథ, కంటెంట్ బట్టి తాను ఎటువంటి బోల్డ్ సీన్స్ చేయడానికైనా రెడీ అని చెప్పకనే చెప్పిసింది అనన్య. ఇక బోల్డ్ సన్నివేశాలకు తాను దూరమని చెప్పిన అనన్య పొట్టేలు సినిమాలో మాత్రం హద్దులు చెరిపేసి యాక్ట్ చేసింది.

ఇక అనన్య నటించిన తంత్ర సినిమాను దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించారు. ఇందులో హీరోగా ధనుష్ రఘుముద్రి నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమాను రవి చైతన్య నిర్మిస్తున్నారు. అయితే తంత్ర సినిమా మార్చి 15న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమా పై భారీగా అంచనాలు పెంచుతోంది.ఇక ఈ సినిమాలో చాలా సన్నివేశాలు భయపెట్టేలా ఉన్నాయి.  కాగా, ఈ సినిమాలో అనన్య పల్లెటూరి అమ్మాయిగా కనిపింబోతోంది. ప‌ల్లెటూర్లలో క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డులు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి సలోని ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

 

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet