iDreamPost
android-app
ios-app

వీడియో: ఆలోచనలు రేకిత్తిస్తున్న అదిరే అభి లైఫ్‌ క్వశ్చన్‌!

వీడియో: ఆలోచనలు రేకిత్తిస్తున్న అదిరే అభి లైఫ్‌ క్వశ్చన్‌!

‘జీవితంలో సక్సెస్‌ ఫుల్‌గా ఉండటం ముఖ్యమా.. సంతోషంగా ఉండటం ముఖ్యమా’.. నటుడు అదిరే అభి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వేసిన ఈ ప్రశ్న ప్రస్తుతం నెటిజన్లలో ఆలోచనలు రేకితిస్తోంది. ఇంతకూ జీవితంలో ఏదో ముఖ్యమో ఆలోచిస్తూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అభి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో.. ‘‘ నేను ఈ రోజు రేడియోలో ఓ టాపిక్‌ విన్నాను. చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అందుకే మీతో షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను. లైఫ్‌లో మీరు సక్సెస్‌ ఫుల్‌గా ఉందామనుకుంటున్నారా? సంతోషంగా ఉందామనుకుంటున్నారా?.. ఇది టాపిక్‌. ఈ టాపిక్‌ వింటున్నపుడు నేను ఆలోచించటం మొదలుపెట్టాను.

సక్సెస్‌ ఫుల్‌గా ఉండటానికి.. సంతోషంగా ఉండటానికి ఏంటి డిఫరెన్స్‌ అనుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా ఉంటే సంతోషంగా ఉంటాం కదా? అనుకున్నాను. రజినీకాంత్‌ గారు కూడా ఓ డిస్కషన్‌లో చెప్పారు. ‘ నేను ఇంత పెద్ద సూపర్‌ స్టార్‌ అయినా కూడా నాకు 10 శాతం కూడా సంతోషం లేదు’ అన్నారు. సక్సెస్‌ అయినంత మాత్రాన సంతోషంగా ఉండాలని లేదు. అలాగని, సంతోషంగా ఉంటే సక్సెస్‌ వస్తుందని కూడా లేదు. పాయింట్‌ ఏంటంటే.. మనిషి తన జీవితంలో సక్సెస్‌ ఫుల్‌గా ఉండటం ముఖ్యమా..

సంతోషంగా ఉండటం ముఖ్యమా.. సంతోషంగా ఉండటం అంటే మనం చేస్తున్నదాంట్లో సంతోషాన్ని వెతుక్కోవటం.. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం. వేరే సమస్యల్ని నెత్తిన పెట్టుకోకుండా ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలి. చిన్న షాపుల్లో పని చేసే వారు.. చిన్న ఇంట్లో ఉండే వారు కూడా హ్యాపీగా ఉంటారు. కానీ, లగ్జరీ ఇళ్లలో ఉండేవారు సంతోషంగా ఉండరు. నీకు నీ జీవితంలో సక్సెస్‌ ఫుల్‌గా ఉండటం ముఖ్యమా.. సంతోషంగా ఉండటం ముఖ్యమా కామెంట్‌ చేయండి’’ అంటూ ఫ్యాన్స్‌ను అడిగారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న ఫ్యాన్స్‌ తమకు ఏది ముఖ్యమో కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి, మీకు ఏది ముఖ్యమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Adhire Abhi (@abbhinav_actor)