iDreamPost
android-app
ios-app

భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆయ్’ ..డే 1 కలెక్షన్స్ ఎంతంటే!

  • Published Aug 16, 2024 | 10:49 AM Updated Updated Aug 16, 2024 | 10:49 AM

AAY Movie Day 1 Collections: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం 'ఆయ్'. ఆగష్టు 15 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకుంటుంది. మరి ఈ సినిమా డే 1 రాబట్టిన కలెక్షన్స్ వివరాలను చూసేద్దాం.

AAY Movie Day 1 Collections: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం 'ఆయ్'. ఆగష్టు 15 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకుంటుంది. మరి ఈ సినిమా డే 1 రాబట్టిన కలెక్షన్స్ వివరాలను చూసేద్దాం.

  • Published Aug 16, 2024 | 10:49 AMUpdated Aug 16, 2024 | 10:49 AM
భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆయ్’ ..డే 1 కలెక్షన్స్ ఎంతంటే!

మ్యాడ్ మూవీతో అందరికి పరిచయం అయిన తారక్ బావమరిది నార్నె నితిన్.. మొదటి సినిమాతోనే అందరిని మెప్పించి ఇప్పుడు ‘ఆయ్’ సినిమాతో మరొక్కసారి ప్రేక్షకులను పలకరించాడు. ఆగష్టు 15 న రెండు పెద్ద సినిమాలతో పోటీగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓ రకంగా నార్నె నితిన్ ఈ విషయంలో సాహసం చేసాడని చెప్పి తీరాల్సిందే. అయినా సరే ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ బజ్ తో థియేటర్స్ లో కొనసాగుతుంది. అంతే కాకుండా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్లు సమాచారం. మరి ఈ సినిమా మొదటి రోజు రాబట్టిన కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం.

ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 బ్యానర్స్ పై.. అల్లు అరవింద్ ‘ఆయ్ ‘ సినిమాను సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా కొప్పినీడు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా ఈ సినిమాకు అంజీ కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నార్నె నితిన్ తో పాటు.. నయన్ సారిక, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ప్రత్యేకించి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరగలేదు.. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసింది. దీనితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్ల షేర్ గా నిర్ణయించింది. ఇక ఈ మూవీ రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.20 లక్షల నికరంగా.. 1.25 గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టగా.. అటు నార్త్ అమెరికాలోను మంచి బజ్ రావడంతో రూ.50 లక్షల వసూళ్లను రాబట్టింది. దీనితో మొదటి రోజు మొత్తం మీద రూ.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను తన ఖాతాలో వేసుకుంది ‘ఆయ్’ సినిమా.

aay movie day 1 collections

ఇదే బజ్ కనుక కొనసాగితే.. ఈ వీకెండ్ అయ్యే లోపు బ్రేక్ ఈవెన్ ను దాటేస్తుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆయ్ మూవీ రిలీజ్ రోజునే మిస్టర్ బచ్చన్ , డబుల్ ఇస్మార్ట్ సినిమాలు కూడా రిలీజ్ కావడంతో.. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కేవలం 200 స్క్రీన్స్ లో మాత్రమే ఈ సినిమాను రిలీజ్ చేశారు. మొదటి షో నుంచి ఆయ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. రానున్న రోజుల్లో ఈ సినిమాకు అన్ని చోట్ల మరిన్ని స్క్రీన్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక లాంగ్ రన్ లో ‘ఆయ్’ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ డే 1 కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis