Keerthi
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎక్కడ చూసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించే తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, ఇలాంటి సమయంలో కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించి గతంలో ఓ పోస్ట్ అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎక్కడ చూసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించే తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, ఇలాంటి సమయంలో కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించి గతంలో ఓ పోస్ట్ అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే..
Keerthi
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మహామ్మారి కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది అమాయకులు తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. కాగా, ఈ కోవిడ్ వైరస్ బారినపడిన వారికి వాటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్లను కనిపెట్టేందుకు విశ్వ ప్రయాత్నలు చేశాయి. అయితే ఇందులో భాగంగానే కోవిషీల్డ్, కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వాక్సిన్ తీసుకున్న వారిలో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇటీవలే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్ లు వస్తునయని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఇక వార్త కాస్త వైరల్ కావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా, దీనిపై ఇప్పుడు దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా.. ఈ కరోనా వ్యక్సిన్ తీసుకున్న తర్వాత దేశంలో గుండెపోటు కేసులు పెరుగతూ వచ్చాయని, ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయని కొందరు అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించి గతంలో ఓ పోస్ట్ అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే..
కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు ‘పునీత్ రాజ్ కుమార్’ అందరికీ సుపరిచితమే. కాగా, ఈయన అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే పునిత్ చాలా ఫిట్ గా ఉంటారనే విషం అందరికీ తెలిసిందే. పైగా నిత్యం వర్కౌట్స్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ, అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా గుండె పోటుకు గురై కన్నుముశారు. అయితే ఆకస్మాత్తు మరణం ఇండస్ట్రీకి, ఆయన అభిమానులకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే. తాజాగా ఇప్పుడు కోవి షీల్డ్ వల్లనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పునీత్ రాజ్ కుమార్ ఏప్రిల్ 7, 2021న వ్యాక్సిన్ తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. పైగా ఆ పోస్ట్ లో ’45 ఏళ్లు పైబడిన వారైతే టీకాలు వేయించుకోవాలని’ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
అయితే పునీత్ చేసిన పోస్ట్ కు అప్పుడు బృందావన అనే అకౌంట్ నుంచి ఓ అభిమాని కామెంట్ చేశాడు. పైగా ఆ కామెంట్ లో ‘కోవిషీల్డ్ తీసుకోవద్దు, ఇది 45 ఏళ్లు పైబడిన వారికి మంచిది కాదు అంటూ రాసుకొచ్చాడు’. ఇక ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది. అలాగే కోవిషీల్డ్ కారణంగానే.. పునీత్ గుండెలో రక్తం గడ్డ కట్టిందా.. అనే ప్రశ్న అందరీలో తలెత్తుంది. కాగా, ప్రస్తుతం పునీత్ చేసిన పోస్ట్ ఇన్నాళ్లకు వైరల్ అవ్వడంతో పునీత్ మరణానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణమంటూ నెటిజన్స్ రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. మరి, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణంగానే పునీత్ గుండెపోటు వచ్చిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Got my first dose of vaccination today. If you are 45 years & above ensure you get vaccinated. #vaccinated #LargestVaccineDrive pic.twitter.com/QsX9NnkjGS
— Puneeth Rajkumar (@PuneethRajkumar) April 7, 2021