iDreamPost
android-app
ios-app

Pat Cummins: రెండోసారి తండ్రి కాబోతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్! పోస్ట్ వైరల్..

  • Published Aug 21, 2024 | 8:00 AM Updated Updated Aug 21, 2024 | 8:00 AM

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తాను రెండోసారి తండ్రి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తాను రెండోసారి తండ్రి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Pat Cummins: రెండోసారి తండ్రి కాబోతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్! పోస్ట్ వైరల్..

సెలబ్రిటీలు తమకు సంబంధించిన శుభవార్తలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. తమ ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా.. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తాను రెండోసారి తండ్రి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. “మా బేబీకి సంబధించిన గుడ్ న్యూస్ ను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా జీవితాల్లో మరింత సంతోషాన్ని పెంచేందుకు వస్తున్న బేబీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని తన భార్య బెకీతో పాటుగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. తన భార్య బెకీ తో పాటుగా కొడుకు ఆల్బీ పిక్స్ ను షేర్ చేశాడు. ఇందులో ఆమె బేబీ బంప్ తో కనిపిస్తోంది.

Australian captain Pat Cummins is going to be a father for the second time!

కాగా.. కమ్మిన్స్-బెకీ బోస్టన్ 2020లో ఎంగేజ్ మెంట్ చేసుకోగా.. 2022లో ఈ జంట మూడుముళ్లతో ఏకమైంది. అయితే 2021లోనే వీరికి అల్బీ అనే కుమారుడు జన్మించాడు. తాజాగా మరోసారి ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు కమ్మిన్స్. తన అద్బుతమైన కెప్టెన్సీతో సన్ రైజర్స్ ను ఏకంగా ఫైనల్ కు చేర్చాడు. ఇక రెండోసారి తండ్రికాబోతున్న కమ్మిన్స్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సహచరల ఆటగాళ్లు, నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Rebecca Jane Cummins (@becky_cummins)