iDreamPost
android-app
ios-app

ఇన్ స్టాలో సమంత పోస్ట్‌ వైరల్‌.. హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది అంటూ!

  • Published Aug 08, 2024 | 5:20 PM Updated Updated Aug 08, 2024 | 5:20 PM

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరికి ఈరోజు ఉదయం నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో హార్ట్ బ్రేకింగ్ సింబల్ తో ఓ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరికి ఈరోజు ఉదయం నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో హార్ట్ బ్రేకింగ్ సింబల్ తో ఓ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Aug 08, 2024 | 5:20 PMUpdated Aug 08, 2024 | 5:20 PM
ఇన్ స్టాలో సమంత పోస్ట్‌ వైరల్‌.. హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది అంటూ!

ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పేర్లు ఏ రేంజ్ లో వైరల్ మారు మోగుతున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నరాని తరుచు వీకేషన్స్ కు కూడా వెళ్తున్నరనే టాక్ వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై, దీనిపై అటు నాగ చైతన్య, శోభిత ఎవ్వరూ స్పందించ లేదు. కానీ, తాజాగా ఈ లవ్ బర్డ్స్ నేడు నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగర్జున సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి ఫోటోలను షేర్ చేసి మరి ప్రకటించారు.

ఇక ఈరోజు (గురువారం ఆగస్ట్ 8వ తేదీ) ఉదయం 9.42 గంటలకు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగింది. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి ఎంగైజ్మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా.. పలువురు సెలబ్రిటీస్ ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా విషెష్ కూడా చెబుతున్నారు. కానీ, ఈ తరుణంలోనే హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ సింబల్ తో ఓ పోస్ట్ షేర్ చేయగా..అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన నుంచి అందరీ కళ్లు ఈ జంటపైనే కాకుండా.. ఓ సమంత మీద కూడా ఉన్నాయి. ఎందుకంటే.. గతంలో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్ని మనస్పర్థల కారణంగా.. చట్టా పరంగా వీడాకులు తీసుకొని ఎవరీ లైఫ్ లో వారు బీజీగా ఉన్నారు. అయితే తన మాజీ భర్త అయిన నాగ చైతన్య ఇప్పుడు వేరొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో.. సమంత సోషల్ మీడియాలో ఎమోషనల్ గా ఏదైన పోస్ట్ పెడుతుందోమో అని నెటిజన్స్, ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో హార్ట్ బ్రేక్ సింబల్ తో ఓ పోస్ట్ షేర్ చేసింది. కానీ, నిజానికి సమంత పోస్ట్ చేసింది వీళ్ల నిశ్చితార్థానికి సంబంధించిన పోస్ట్ కాదు. పారిస్ ఒలింపిక్స్ లో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా.. గోల్డ్ , సిల్వర్ మెడల్ గెలిచే అవకాశం కోల్పోయిన వినేశ్.. మరుసటి రోజే రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఉద్దేశించి సమంత ఈ పోస్ట్ చేసింది.

Heroine, Samantha Ruth Prabhu 1

బారత ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ భారత్ ఆమెకు మద్దతూ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ సమంత కూడా వినేశ్ కి ధైర్యం చెబుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ లో సమంత.. ‘కొన్నిసార్లు , పోరాడే వ్యక్తులు చాలా కష్టతరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంత మాత్రనా మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. మీరు మరీంత శక్తితో తిరిగొస్తారు. మీ అద్భుతమైన సామర్థ్యంతో ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇలా నిలదొక్కుకోవడం నిజంగా మెచ్చుకోదగినది’ అని సమంత ఆ ట్వీట్ ను పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో.. అంతా నాగచైతన్య గురించే చేసిదనుకుంటూ తెగ ఇంట్రెస్ట్ చూశారు. మరీ, సమంత రెజ్లర్ వినేశ్ గురించి ఈ రకంగా పోస్ట్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap