iDreamPost
android-app
ios-app

90’s వెబ్ సిరీస్‌లోని పాప.. అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందేంటి!

  • Published May 06, 2024 | 4:00 PM Updated Updated May 06, 2024 | 4:00 PM

మధ్యతరగతి కుటుంబంలోని సుఖాలను, దు:ఖాలను చూపించిన వెబ్ సిరీస్ 90's- ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ సిరీస్.. విశేషంగా ఆకట్టుకున్న సంగతి విదితమే. ఇందులో ఓ యంగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సుచిత, రఘు ప్రేమకు కథకు కనెక్ట్ అయిపోతారు.

మధ్యతరగతి కుటుంబంలోని సుఖాలను, దు:ఖాలను చూపించిన వెబ్ సిరీస్ 90's- ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ సిరీస్.. విశేషంగా ఆకట్టుకున్న సంగతి విదితమే. ఇందులో ఓ యంగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సుచిత, రఘు ప్రేమకు కథకు కనెక్ట్ అయిపోతారు.

  • Published May 06, 2024 | 4:00 PMUpdated May 06, 2024 | 4:00 PM
90’s వెబ్ సిరీస్‌లోని పాప.. అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందేంటి!

సీనియర్ నటుడు శివాజీ చాలా రోజుల తర్వాత 90’s- ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్‌తో పలకిరించాడు. ఈ ఏడాది జనవరిలో ఓటీటీలో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ప్రతి మధ్య తరగతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు కనెక్ట్ అయ్యాడు. తమను తాము ఓన్ చేసుకున్నారు. అంతలా కట్టిపడేసింది ఈ సిరీస్. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ఈ సిరీస్ హిట్‌తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు శివాజీ. ఆయన భార్యగా వాసుకీ ఆనంద్ బాగా ఆకట్టుకుంది. వీరి పిల్లలుగా నటించారు మౌలీ, దివ్య, రోషన్ రాయ్. రోషన్ రాయ్ నటన అయితే నవ్వులు పువ్వులు పూయించింది. ఆదిత్య హాసన్ డైలాగులకు ఫిదా అయిపోయారు. కేవలం ఆడియన్సే కాదు.. రాజమౌళి వంటి దర్శకులు కూడా మెల్ట్ అయిపోయి.. ప్రేమలు తెలుగు డబ్ వర్షన్ కు మాటలు రాయాలంటూ పురమాయించాడు.

ఇక ఇందులో డైలాగ్స్ .. సంప్రదాయాని సుద్ద పూసనీ పాటను ఇప్పుడు ఓ మీమర్‌గా మారిపోయింది. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ పడిపోయారు. ఇందులో యంగ్ లవ్ స్టోరీని కూడా చూపించాడు దర్శకుడు హాసన్. టెన్త్ క్లాస్ లవ్ స్టోరీని చూపించాడు. సుచిత, రఘు ప్రేమ కథను స్కూల్ లవ్ మనస్సులకు హత్తుకుపోయింది. ‘మనసు మంగళం, వయసు మంగళం, చెలిమి మంగళం, నీ ప్రేమ మంగళం’ అంటూ వీరిద్దరి మధ్య ఓ లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇందులో సుచితా డేవిడ్ పాల్ క్యారెక్టర్‌లో మెరిసింది అమ్మాయి పేరు స్నేహాల్ కామత్. ఇందులో రింగు రింగుల జుట్టుతో.. స్కూల్ డ్రెస్సులో తన క్యూట్ నటనతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. అందులో చిన్న అమ్మాయిగా కనిపించిన ఈ పాపనే ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఈ సిరీస్ వచ్చి ఇలా మూడు నెలల అవుతుందో లేదో ఓ స్టన్నింగ్ వీడియోతో ఆకట్టుకుంటోంది.

ఇన్ స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసుకుంది స్నేహాల్. ఇందులో డీ గ్లామర్ పాత్రలో.. పెద్ద మహిళలా కనిపిస్తోంది. ఇందులో బేస్త అమ్మాయి (చేపలు అమ్ముతూ ఉంటుంది)గా నటించింది. భర్తను ప్రేమించే ఓ ఇల్లాలు.. అతడి కోసం ఇష్టమైన చేపల కూర వండిపెట్టి.. దగ్గర ఉండి కొసరి కొసరి వడ్డించడం వరకు ఉంది. స్నేహాల్ ఇందులో కాస్త భిన్నంగా కనిపిస్తోంది. చూడముచ్చడగా ఉంది ఈ అమ్మాయి. మొన్నటి వరకు చిన్నపిల్లగా మెస్మరైజ్ చేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు వయస్సుకు మించి నటనలో పరిణతిని చూపిస్తోంది. ఇక 90 వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయిన ఈ అమ్మడు..తన ఫోటో షూట్లతో సోషల్ మీడియాను కూడా షేక్ చేసేస్తుంది. యుపిలో పుట్టి పలుప్రాంతాల్లో పెరిగి.. ప్లస్ 12 చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చి.. అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 90’s వెబ్ సిరీస్‌కు ముందు హలో వరల్డ్, కైలాస పురం, తరగతి గది దాటి,  బాల, భువన విజయం, లైఫ్ ఆఫ్ త్రీ వంటి వెబ్ సిరీస్, సినిమాల్లో  కూడా చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom