ఓటిటి మూవీస్ జాతర! రేపు ఒకేసారి 22 సినిమాలు రిలీజ్!

  • Author ajaykrishna Published - 04:21 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Published - 04:21 PM, Thu - 17 August 23
ఓటిటి మూవీస్ జాతర! రేపు ఒకేసారి 22 సినిమాలు రిలీజ్!

ఓటిటి లవర్స్ కి ప్రతీ వారం.. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం పండగ వాతావరణమే అవుతుంది. ఎందుకంటే.. ఆల్రెడీ ఉన్న ఓటిటి ప్లాట్ ఫామ్స్ మాత్రమే కాకుండా కొత్తగా ఎన్నో ఓటిటి వేదికలు పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులను అలరించడానికి ఆ రేంజ్ లో పోటీ పడుతున్నాయి ఓటిటిలు. శుక్రవారం వస్తే చాలు.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు కుప్పలుగా వచ్చి వాలిపోతాయి. ఇంకేముంది.. వెయిట్ చేస్తున్న ఓటిటి ఫ్యాన్స్ అందరికీ బిర్యానీ దొరికినట్లే అనుకోవాలి. ప్రతీ వారం మాదిరే ఈసారి కూడా పదుల సంఖ్యలో ఓటిటి సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. సరే వారం మొత్తంలో అన్ని సినిమాలు అనుకుంటే పొరపాటే.

తాజా సమాచారం ప్రకారం.. కేవలం శుక్రవారం రోజునే ఏకంగా ఇరవైకి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందుకోసం తెలిసినవి.. కొత్తగా పుట్టుకొచ్చిన ఓటిటిలు సైతం స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం అయిపోయాయి. అయితే.. ఓటిటి సినిమాలకు ఆదరణ పెరిగిన తర్వాత.. సినిమా లవర్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూసేస్తున్నారు. కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు ఏ భాషలో విడుదలయినా.. స్ట్రీమింగ్ కి వచ్చాక మన భాషలో అందుబాటులోకి వస్తే.. ఖచ్చితంగా వదలకుండా చూస్తారు ప్రేక్షకులు. మరి ఈసారి ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్ కి కాచుకున్నాయి.

రేపు ఒక్కరోజే స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు:

నెట్ ఫ్లిక్స్:

  • గన్స్ & గులాబ్స్ – హిందీ
  • మాస్క్ గర్ల్ – ఇంగ్లీష్
  • ది మంకీ కింగ్ – ఇంగ్లీష్
  • లవ్ యూ లాంగ్ టైమ్ – ఇంగ్లీష్
  • బ్లూ అగైన్ (థాయి)
  • 10 డేస్ ఆఫ్ బ్యాడ్ మ్యాన్ – టర్కిష్
  • ది అప్ షాష్ 4 – స్ట్రీమింగ్
  • డెప్ వి హర్డ్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)
  • ది చోసేన్ వన్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్:

  • హార్లోన్ కాబెన్స్ షెల్టర్ – ఇంగ్లీష్
  • ఏపీ దిల్లాన్ ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్ – సిరీస్

హాట్ స్టార్:

  • మాతగం – తమిళం

జీ5:

  • దుర్గంగా s2 – హిందీ సిరీస్

డాక్యూ బే:

  • ఎక్స్ పెల్డ్ ఫ్రమ్ ది టాప్ – ఇంగ్లీష్
  • ది లాంగెస్ట్ హోల్ – ఇంగ్లీష్ (ఆగష్టు 20)

సోనీలివ్:

  • అయిరాతోన్ను నునకల్ – మలయాళం

జియో సినిమా:

  • తాళి – హిందీ సిరీస్

సైనా ప్లే:

  • శుభదినం – మలయాళం

లయన్స్ గేట్ ప్లే:

  • మైండ్ కేజ్ – ఇంగ్లీష్
  • వెరీ బ్యాడ్ థింగ్స్ – ఇంగ్లీష్

సన్ నెక్స్ట్:

  • కాసేతాన్ కడవులడా – కన్నడ

బుక్ మై షో:

  • స్టోరీస్ నాట్ టు బి టోల్డ్ – ఇంగ్లీష్
Show comments