iDreamPost
android-app
ios-app

వచ్చే మూడు నెలల్లో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయం

  • Published Sep 26, 2024 | 12:30 AM Updated Updated Sep 26, 2024 | 12:30 AM

2024 Upcoming Movies : ప్రేక్షకులు సినిమాలను ఏ విధంగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ బావుంటే కనుక ఇక ఆ సినిమాకు నెక్స్ట్ లెవెల్ లో హైప్ పెంచేస్తారు. అయితే 2024 లో ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలు ఒక లెక్క.. ఇకపై రిలీజ్ కాబోయే సినిమాలు మరో లెక్క అంటున్నారు ట్రేడ్ పండితులు.

2024 Upcoming Movies : ప్రేక్షకులు సినిమాలను ఏ విధంగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ బావుంటే కనుక ఇక ఆ సినిమాకు నెక్స్ట్ లెవెల్ లో హైప్ పెంచేస్తారు. అయితే 2024 లో ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలు ఒక లెక్క.. ఇకపై రిలీజ్ కాబోయే సినిమాలు మరో లెక్క అంటున్నారు ట్రేడ్ పండితులు.

  • Published Sep 26, 2024 | 12:30 AMUpdated Sep 26, 2024 | 12:30 AM
వచ్చే మూడు నెలల్లో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయం

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా.. నెక్స్ట్ వచ్చే సినిమాలను చూడడం మాత్రం మానరు ప్రేక్షకులు. ఆడియన్స్ సినిమాలను ఏ విధంగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కొన్ని సినిమాలకైతే ముందు నుంచే స్పెషల్ హైప్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలలో.. కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించాయి. దీనితో ఇప్పటివరకు జరిగిన సినిమా పండగ ప్రేక్షకులకు సగం శాటిస్ఫాక్షన్ ఏ ఇచ్చిందని చెప్పి తీరాలి. వచ్చే మూడు నాలుగు నెలలు మాత్రం.. మూవీ లవర్స్ కు ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉండబోతుంది. 2024 లో ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలు ఒక లెక్క.. ఇకపై రిలీజ్ కాబోయే సినిమాలు మరో లెక్క అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి లెక్కలు తేల్చబోయే సినిమాలేంటో చూసేద్దాం.

వచ్చే మూడు నాలుగు నెలల్లో బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు తేల్చడానికి .. తెలుగు, తమిళం నుంచి మొత్తం 5 సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. వాటిలో మరో రెండు రోజుల్లో దేవర సినిమా రిలీజ్ కాబోతుంది. మూవీ లవర్స్ అంతా దేవర ఫీవర్ లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో దేవర మ్యానియాని ఎలాగూ అటు ప్రేక్షకులు, ఇటు ఇండస్ట్రీ అంతా ఎక్స్పీరియెన్స్ చేస్తారు. రికార్డ్స్ తిరగరాయడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. ఇక ఆ తర్వాత దసరా కానుకగా అక్టోబర్ 10న రజిని కాంత్ వెట్టాయాన్ మూవీ.. నవంబర్ 14 న సూర్య కంగువా సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు తమిళ చిత్రాలపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలు కాకుండా డిసెంబర్ ఆడియన్స్ కు కిక్ ఇచ్చేలా.. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రానున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేయాల్సిన.. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడంటే దేవర హైప్ లో ఉండి ఈ సినిమా గురించి పట్టించుకోట్లేదు కానీ.. పుష్ప-2 మీద కూడా విపరీతమైన హైప్ నెలకొంది. దేవర తర్వాత అది కచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత డిసెంబర్ 20న రానున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ… ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే హైప్ క్రియేట్ అవుతూ ఉంది. మరి ఈ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ ప్రేక్షకులలో ఇంకా ఎలాంటి అంచనాలను పెంచుతాయో.. రిలీజ్ తర్వాత ఈ సినిమాలను ఆ అంచనాలను అందుకుంటాయో లేదో చూడాలి. మరి ఈ మూవీ అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler