సమ్మర్ లో పెరుగు గడ్డలా తోడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Tips For Making Thick Yogurt In Hot Summer: మండే వేసవిలో పాలను తోడు వేసి మంచి గడ్డ పెరుగు తయారు చేయడం అంటే ఎంతో కష్టం. ఒక్కోసారి అది అసాధ్యం కూడా. కానీ, ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఇంట్లోనే మంచి గడ్డ పెరుగు తయారు చేసుకోవచ్చు.

Tips For Making Thick Yogurt In Hot Summer: మండే వేసవిలో పాలను తోడు వేసి మంచి గడ్డ పెరుగు తయారు చేయడం అంటే ఎంతో కష్టం. ఒక్కోసారి అది అసాధ్యం కూడా. కానీ, ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఇంట్లోనే మంచి గడ్డ పెరుగు తయారు చేసుకోవచ్చు.

మండే ఎండల వల్ల బయటే కాదు.. ఇంట్లో కూడా తిప్పలు తప్పడం లేదు. ఆ ఉక్కపోత ఒక గొడవ అయితే వంటింట్లో ఉండే వాళ్లకు అంతకు మించిన కష్టాలు ఉంటూ ఉంటాయి. వండిన ఆహారం ఫ్రెష్ గా ఉండదు. ఉదయం చేసిన కర్రీ మధ్యాహ్నానికే పాడవుతూ ఉంటుంది. వీటికి తోడు రాత్రి తోడు పెట్టిన పాలు తెల్లారినా కూడా పాలలాగానే ఉంటాయి. ఎందుకంటే వేసవిలో పాలు తోడుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. అయితే మీరు చాలా సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు. ఇంట్లోనే గట్టిగా, గడ్డలాంటి పెరుగును తయారు చేసుకోవచ్చు.

ఎండాకాలం పాలు ఒక పట్టాన తోడుకోవు. అమ్మమ్మలు, నానమ్మల కాలంలో అంటే వాళ్లు మట్టి పాత్రల్లో పాలను తోడు పెట్టేవాళ్లు. అందుకే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అన్నీ స్టీల్ పాత్రలు అయిపోయాయి. కాబట్టే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. బయట ఉంటే రూమ్ టెంపరేచర్ కు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాగని తోడు వేసిన పాలను ఫ్రిడ్జ్ లో పెట్టలేరు. అలా చేస్తే అవి తోడుకోవు. అలాగని బయట ఉంచినా కూడా తోడుకోవడం కష్టం. అవి గట్టిగా తోడుకోవాలంటే మొదట తోడు వేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలంలో వేసినట్లు వేసవిలో పాలు వెచ్చగా ఉన్నప్పుడే తోడుకు పెరుగు కలిపేస్తే సరిగ్గా తోడుకోవు. బాగా గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఆ పాలలో ఒక స్పూన్ పెరుగు వేయండి. అలా వదిలేయకుండా స్పూన్ తో పాలను కాస్త తిప్పండి. అలాగే మీరు ఆ పాలను వంటగదిలో వదిలేయకూడదు. వంటగదిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తోడుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని తోడుపెట్టిన ఆ పాలను ఇంట్లో కాస్త చల్లగా ఉండే ప్రదేశం(ఫ్రిడ్జ్ లో కాదు)లో ఉంచండి. వీటికి అదనంగా పాలు తోడు పెట్టే సమయంలో ఆ పాలల్లో 2 చుక్కల నిమ్మరసం వేయండి.

మరీ ఎక్కువ నిమ్మరసం వేస్తే పాలు పాడవ్వచ్చు. అందుకే కేవలం రెండంటే రెండు చుక్కలు నిమ్మరసం కలపండి. ఇలా చేయడం వల్ల పాలు చక్కగా తోడుకుంటాయి. లేదంటే పాలను తోడు పెట్టిన తర్వాత ఆ పాలల్లో ఒక ఎండు మిర్చి ముక్క లేదా పచ్చిమిర్చిని వేయండి. ఇలా చేయడం వల్ల కూడా పాలు చక్కగా తోడుకుంటాయి. అయితే రాత్రి తోడు వేసిన పాలు తెల్లారేసరికి తోడుకున్నాయి అని హ్యాపీగా ఫీలవ్వద్దు. ఆ తర్వాత చేయాల్సిన ఇంకో పని ఉంది. అదేంటంటే.. ఉదయం లేచిన తర్వాత ఆ పెరుగు గిన్నెను ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. బయట ఉంచడం వల్ల పెరుగు పుల్లగా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్డడం వల్ల పెరుగు క్రీమీగా, మీగడ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి.. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్లకు షేర్ చేసి వారికి కూడా ఈ టిప్స్ తెలిసేలా చెప్పండి.

Show comments