iDreamPost
android-app
ios-app

రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. అసలు కారణం ఇదే?

Sand box in Train: రైలు ప్రమాదాల నివారణకు టెక్నికల్ గా చర్యలు తీసుకుంటుంది రైల్వే శాఖ. దీనిలో భాగంగా రైలు పట్టాలపై ఇసుకను ఎందుకు పోస్తారో తెలుసా? కారణం ఏంటంటే?

Sand box in Train: రైలు ప్రమాదాల నివారణకు టెక్నికల్ గా చర్యలు తీసుకుంటుంది రైల్వే శాఖ. దీనిలో భాగంగా రైలు పట్టాలపై ఇసుకను ఎందుకు పోస్తారో తెలుసా? కారణం ఏంటంటే?

రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. అసలు కారణం ఇదే?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అదిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉన్నది. నిత్యం లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందింది. సమయం ఆదా అవడం, ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగా ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే ఇంట్రెస్టు చూపిస్తుంటారు. అయితే ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే డిపార్ట్ మెంట్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. టెక్నికల్ గా ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడుతుంది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించనప్పుడు రైలు సురక్షితంగా వెళ్లేందుకు పట్టాలపై ఇసుకను పోసేలా రైళ్లలో శాండ్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఇసుకును పోయడానికి గల కారణ ఏంటంటే?

రైలు ప్రయాణంపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపుతుంటాయి. ఏ వాతావరణంలోనైనా ట్రైన్లు సురక్షితంగా ప్రయాణించేలా తగు ఏర్పాట్లను చేస్తుంది రైల్వే శాఖ. రైలు ప్రమాదాలు చోటుచేసుకోకుండా రైలు పట్టాల మధ్య కొంత గ్యాప్ ఇవ్వడం, రైల్వే ట్రాక్ మధ్యలో కంకర నిపడం, రైలు పట్టాల మీద ఇసుక పడే విధంగా ఏర్పాట్లు చేస్తుంటారు. వీటిల్లో ఇసుకను పట్టాల మీద చల్లడానికి గల కారణం ఏంటంటే.. వర్షాకాలంలో లేదా పొగమంచు, లేదా పట్టాలపై గ్రీజు కారణంగా పట్టాలు తడిసిపోతుంటాయి. ఈ సమయాల్లో రైలు ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే రైలు చక్రాల దగ్గర ఇసుక బాక్సులను ఏర్పాటు చేశారు.

పట్టాలు తడిగా ఉన్నప్పుడు రైలు నిర్ణీత వేగంతో ముందుకు కదిలేందుకు లోకోపైలట్ శాండ్ బాక్స్ లోని ఇసుక పట్టాలపై పడేందుకు స్విచ్ నొక్కుతాడు. ఇసుక పట్టాలపై పడగానే రైలు పట్టాలు, చక్రాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఫలితంగా, చక్రం జారడం తగ్గి, రైలు సులభంగా ముందుకు కదులుతుంది. ఏ వాతావరణంలోనైనా రైలు సరైన వేగంతో ముందుకు సాగుతుంది. ఇలా చేయకపోతే చక్రం ముందుకు కదలదు, ఉన్న చోటనే తిరుగుతుంది. ఇసుక సహాయంతో, అటువంటి కొండ, ఏటవాలు ప్రదేశాలలో బ్రేకింగ్ చేయడం ద్వారా రైలును ఆపడం సులభం అవుతుంది. దీంతో రైలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడొచ్చు. ఈ శాండ్ బాక్స్ అన్ని రకాల ట్రైన్లలో అందుబాటులో ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by kamleshshergill🇮🇳 (@kamleshshergill72)