P Venkatesh
బ్యాంకు జాబ్స్ కోచింగ్ కు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల. వేలది మంది విద్యార్థులు బ్యాంక్ కోచింగ్ కోసం నంద్యాలకు క్యూ కడుతుంటారు. బ్యాంక్ పరీక్షల కోచింగ్ కు నంద్యాల ఎందుకంత ఫేమస్ అయ్యిందంటే?
బ్యాంకు జాబ్స్ కోచింగ్ కు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల. వేలది మంది విద్యార్థులు బ్యాంక్ కోచింగ్ కోసం నంద్యాలకు క్యూ కడుతుంటారు. బ్యాంక్ పరీక్షల కోచింగ్ కు నంద్యాల ఎందుకంత ఫేమస్ అయ్యిందంటే?
P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాలకు, బ్యాంకు ఉద్యోగాలకోసం యూత్ అలుపనేదే లేకుండా శ్రమిస్తుంటారు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలు సాధించేందుకు ఏళ్లకేళ్లుగా ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంకు ఉద్యోగమైతే ఒత్తిడి ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో విధుల నిర్వహణ, మంచి జీతం, అన్నిటికి మించి సెలవులు ఎక్కువగా ఉండడంతో బ్యాంకు ఉద్యోగాల పట్ల యూత్ తెగ ఇంట్రస్టు చూపిస్తుంటారు. అయితే బ్యాంకు ఉద్యోగం సాధించడమంటే అంత ఈజీ కాదు. సరైన శిక్షణ, ప్రణాళిక ఉంటేనే సాధ్యమవుతుంది. కాగా బ్యాంకు జాబ్స్ కోసం కోచింగ్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల మాత్రమే. బ్యాంకు పరీక్షల కోచింగ్ అంటేనే నంద్యాల అన్నంతగా ఫేమస్ అయ్యింది. అసలు బ్యాంకు పరీక్షల కోచింగ్ కు నంద్యాల ఎందుకంత ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం.
సివిల్ పరీక్షల కోసం ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఢిల్లీకి వెళ్తుంటారు. టీచర్ జాబ్స్ కోసం అవనిగడ్డ ఫేమస్. బ్యాంకు పరీక్షల కోసం మాత్రం ఏపీలోని నంద్యాల పాపులారిటీ పొందింది. ఇక్కడ వేలాది మంది ఆశావాహులు కోచింగ్ కోసం వస్తుంటారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాల నుంచి నంద్యాలకు తరలి వచ్చి బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. నంద్యాలలో లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండడంతో పేద, మద్య తరగతి విద్యార్థులకు ఆర్థిక భారం తప్పుతోంది. నంద్యాలలోని ఎన్జీవో కాలనీ మినీ యూనివర్సిటీని తలపిస్తూ ఉంటుంది. బ్యాంకు పరీక్షల కోచింగ్ కోసం వచ్చే వారితో కిటకిటలాడుతూ ఉంటుంది. కోచింగ్ ఫీజులు తక్కువగా ఉండడం, ఇక్కడ కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వస్తుండడంతో విద్యార్థులు అంతా ఇక్కడికే క్యూ కడుతున్నారు.
కాగా నంద్యాలలోని శ్రీ గురు రాఘవేంద్ర ఇన్సిట్యూట్ పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరంగా మారింది. ఈ ఇన్సిట్యూట్ వల్లే నంద్యాలకు ఇంతటి గుర్తింపు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇన్సిట్యూట్ వల్ల నంద్యాలలో వందల కుటుంబాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి పొందుతున్నాయి. అయితే దస్తగిరి రెడ్డి స్థాపించిన శ్రీ గురు రాఘవేంద్ర ఇన్సిట్యూట్ లో ఫీజు కేవలం 15 వేలు మాత్రమే. ఒక వేళ జాబ్ రాకపోతే జాబ్ వచ్చేంత వరకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు ఇన్సిట్యూట్ చైర్మన్ దస్తగిరి రెడ్డి. 3500 హాస్టల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు 1500 మొంత్తం కలుపుకుని నెలకు 500 వేలు అవుతుందన్నారు. ఇవన్ని కలుపుకుని 75 వేలల్లోనే గట్టిగా కష్టపడితే జాబ్ కొట్టొచ్చంటున్నారు దస్తగిరి రెడ్డి.
ఏటా బ్యాంకు ఉద్యోగాల కోసం నిర్వహించే ఐబీపీఎస్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతుంటారు. అందులో నంద్యాలలోని శ్రీ గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నుంచి ఇప్పటి వరకు లక్షమంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 41 వేల మంది బ్యాంక్ జాబ్ లు పొందినట్లు తెలిపారు. 1979లో డిగ్రీ పాసైనప్పటికీ తనకు జాబ్ రావడానికి మూడేళ్లు పట్టిందని తెలిపారు దస్తగిరి రెడ్డి. ఇంగ్లీష్ పై పట్టులేకపోవడంతో తనకు జాబ్ రావడం ఆలస్యమైందని.. ఈ కారణంగానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండాలని ఈ కోచింగ్ సెంటర్ ను 1989లో స్థాపించినట్లు ఆయన తెలిపారు.