P Venkatesh
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే డిపార్ట్ మెంట్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలిని కోరింది.
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే డిపార్ట్ మెంట్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలిని కోరింది.
P Venkatesh
మీరు టెన్త్, ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. రైల్వేలో పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీగా ఉన్న 1832 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది రైల్వే శాఖ. కేవలం పదోతరగతి, ఐటీఐతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందొచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.rrcecr.gov.in/ ను సందర్శించాలని తెలిపింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ – ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈసీఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 1832 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటికే నవంబర్ 10 2023 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభమైనవి. అభ్యర్థులు డిసెంబర్ 09 2023 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ముఖ్యమైన సమాచారం
యాక్ట్ అప్రెంటిస్. మొత్తం ఖాళీలు
1832
అర్హత:
టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
డివిజన్/యూనిట్లు:
దానాపూర్ డివిజన్, ధన్‌బాద్ డివిజన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోన్‌పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్(హర్నౌట్), మెకానికల్ వర్క్‌షాప్(సమస్తిపూర్).
ట్రేడ్‌లు:
ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్‌స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
వయోపరిమితి:
జనవరి 1, 2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ.100.
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ
10-11-2023
దరఖాస్తుకు చివరితేది:
09-12-2023
అధికారిక వెబ్‌సైట్: