iDreamPost
android-app
ios-app

ఈ అర్హతలుంటే చాలు.. రైల్వేలో 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌ మీవే

మీరు రైల్వే జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు భారీ గుడ్ న్యూస్. వందలు కాదు ఏకంగా 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌ ను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నది రైల్వే డిపార్ట్ మెంట్.

మీరు రైల్వే జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు భారీ గుడ్ న్యూస్. వందలు కాదు ఏకంగా 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌ ను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నది రైల్వే డిపార్ట్ మెంట్.

ఈ అర్హతలుంటే చాలు.. రైల్వేలో 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌ మీవే

అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులను కలిగి ఉంది భారతీయ రైల్వే. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన సిబ్బందిని నియమిస్తుంది. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి తరచుగా జాబ్ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో యువత రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటారు. రైల్వే జాబ్ సాధిస్తే మంచి వేతనంతో పాటు ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ఏకంగా 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌ ను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నది. మీరు రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదొక సువర్ణావకాశం.

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్నవారికి లక్కీ ఛాన్స్. రైల్వే డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల జాతర మొదలైంది. వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులకు గత జనవరిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 5,696 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే తాజాగా ఆ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలో జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడించనున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది.

అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జనవరిలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ స్పష్టం చేసింది. 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి