iDreamPost
android-app
ios-app

10th పాసైతే చాలు.. రైల్వేలో 1,202 ఉద్యోగాలు రెడీ.. ఎగ్జామ్ ఫీజు లేదు

మీరు పదోతరగతి పాసయ్యారా? అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వేలో 1202 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు పదోతరగతి పాసయ్యారా? అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వేలో 1202 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

10th పాసైతే చాలు.. రైల్వేలో 1,202 ఉద్యోగాలు రెడీ.. ఎగ్జామ్ ఫీజు లేదు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నట్లైతే ఇదే మంచి అవకాశం. పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ లేవని బాధపడే వారు ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1202 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్‌ లోకో పైలట్‌, ట్రైన్‌ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

 

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 1,202

విభాగాల వారీగా ఖాళీలు:

  • అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు : 827
  • రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ) : 375

అర్హత:

  • అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆర్మేచర్ & కాయిల్ వార్డర్ /ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ ఫిట్టర్/ హీట్ ఇంజన్ /ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్/ ఇతర ట్రేడ్ మెట్రిక్యులేషన్ / ఎస్‌ఎస్‌ఎల్సీ ప్లస్ ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. రైలు మేనేజర్ పోస్టుల కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అన్ రిజర్డ్వ్ వారు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఓబీసీ- 18 నుంచి 45 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ- 18 నుంచి 47 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ఎంపిక సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఎంపికైతే 5200 –20,200 +.జీపీ 1900, రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ) ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 5200 – 20,200 +జీపీ 2800 అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • పూర్తి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 13-05-2024

దరఖాస్తు చివరి తేదీ:

  • 12-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి