iDreamPost
android-app
ios-app

8thతో చదువు ఆపేసినా.. మంచి వేతనంతో ప్రభుత్వ ఉద్యోగం.. త్వరగా అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య సంస్థల్లో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎనిమిదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందొచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య సంస్థల్లో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎనిమిదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందొచ్చు.

8thతో చదువు ఆపేసినా.. మంచి వేతనంతో ప్రభుత్వ ఉద్యోగం.. త్వరగా అప్లై చేసుకోండి

మీరు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఆపై చదువు ఆపేసారా? ఎనిమిదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారా? అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. ఎనిమిది, ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు కర్నూలు జీజీహెచ్ ప్రకటించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి లైఫ్ లో సెటిలైపోవచ్చు. ఎనిమిదో తరగతి అర్హతతో యానిమల్ అటెండెంట్ ఉద్యోగాన్ని దక్కించుకోవచ్చు. నెలకు రూ. 15 వేల జీతాన్ని అందిస్తారు. కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య సంస్థల్లో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కర్నూలు మెడికల్ కాలేజ్ (కర్నూలు), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (కర్నూలు), రీజనల్ ఐ హాస్పిటల్ (కర్నూలు), గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (కర్నూలు), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (నంద్యాల), ప్రభుత్వ వైద్య కళాశాల (ఆదోని), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆదోని) వైద్య సంస్థల్లో భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 9 వరకు ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం కర్నూలు జిల్లా అధికారిక వెబ్ సైట్ ను https://kurnool.ap.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం ఖాళీలు:
  • 94

పోస్టుల వారీగా ఖాళీలు:

  • జూనియర్ అసిస్టెంట్: 50
  • పర్సనల్ అసిస్టెంట్: 01
  • లైబ్రరీ అటెండెంట్: 01
  • వార్డెన్(ఫిమేల్): 02
  • క్లాస్ రూం అటెండెంట్: 01
  • డార్క్ రూమ్ అసిస్టెంట్: 01
  • మౌల్డ్ టెక్(సీనియర్): 01
  • OT అసిస్టెంట్: 01
  • ఈఎన్ఎంజీ: 01
  • ఈఈజీ: 01
  • ఆర్థో టెక్నీషియన్: 02
  • ఆర్థోటిస్ట్: 01
  • ప్రోస్తేటిక్ టెక్నీషియన్: 02
  • ప్రోస్తెటిస్ట్: 01
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
  • రిసెప్షనిస్ట్ కమ్-క్లర్క్: 01
  • డ్రైవర్: 01
  • పెయింటర్: 01
  • వైర్‌మెన్: 01
  • కార్పెంటర్: 01
  • స్ట్రెచర్ బేరర్: 01
  • హౌస్ కీపర్/హౌస్ కీపర్Gr-II: 02
  • బార్బర్: 02
  • హెల్పర్: 03
  • లస్కర్: 02
  • లిఫ్ట్ అటెండెంట్: 02
  • పంప్‌మన్: 02
  • షూ మేకర్: 01
  • వాన్ అటెండెంట్: 01
  • యానిమల్ అటెండెంట్: 01
  • గార్డెనర్: 02
  • ధోబీ: 01

అర్హత:

  • పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • ఓసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్

ఎంపిక విధానం:

  • విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను బట్టీ నెలకు రూ. 15 వేల నుంచి రూ. 32 వేల వరకు అందిస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

  • ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపాల్, కర్నూల్ మెడికల్ కాలేజ్, కర్నూల్.

దరఖాస్తు ప్రారంభ తేది:

  • 02-01-2024

దరఖాస్తుకు చివరి తేది:

  • 09-01-2024

కర్నూలు జిల్లా అధికారిక వెబ్ సైట్: