P Venkatesh
ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది ప్రముఖ కంపెనీ. ఇక మీరు వద్దన్నా ఉద్యోగం పొందొచ్చు.
ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది ప్రముఖ కంపెనీ. ఇక మీరు వద్దన్నా ఉద్యోగం పొందొచ్చు.
P Venkatesh
భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇక్కడ ప్రతీ ఏటా వేలాది మంది యువత డిగ్రీపట్టాలతో బయటకి వస్తున్నారు. ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమయ్యే పనికాదు. అందుకోసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. స్వయం ఉపాధి కల్పించేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కొంత మంది యువత ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే.. మరికొందరు బిజినెస్ లో రాణిస్తున్నారు. మరి మీరు కూడా ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ కంపెనీ ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతోంది.
ఏ కంపెనీలో అయినా ఉద్యోగం పొందాలంటే తగిన విద్యార్హతలతో పాటు నైపుణ్యాలు ఉండాల్సిందే. అప్పుడే మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు మీ సొంతం అవుతాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఐఫోన్ తయారీ కంపెనీ భారత్ లో భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 5 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు సమాచారం. వచ్చే మూడేళ్లలో యాపిల్ కంపెనీ భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించి లక్షలాది మందికి జాబ్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్ విక్రేతలు, సరఫరాదారులు భారతదేశంలో 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
అయితే యాపిల్ ఇండియాలో తమ ఉత్పత్తిని దాదాపు 5 రెట్లు పెంచాలని చూస్తోంది. వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశంలో తమ ఉత్పత్తిని దాదాపు 40 బిలియన్ డాలర్లకు (రూ. 3.32 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలంటే యాపిల్ చాలా ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆపిల్ చైనాలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. దీని తర్వాత కంపెనీ భారత్ వైపు దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ కంపెనీ భారత్ లో పెట్టుబడులు పెట్టి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతోంది.