ఆర్మీలో చేరడమే మీ లక్ష్యమా?.. అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి

భారత సైన్యంలో మీరు చేరాలనుకుంటున్నారా? అయితే సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆ తేదీన ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనండి.

భారత సైన్యంలో మీరు చేరాలనుకుంటున్నారా? అయితే సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆ తేదీన ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనండి.

దేశ సేవలో పాలుపంచుకోవాలని యువత కలలు కంటుంటారు. భారత సైన్యంలో చేరాలని తాపత్రయ పడుతుంటారు. శత్రు దేశాల నుంచి ఉగ్రవాదుల నుంచి దేశ సంపదను, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ చేస్తున్న కృషి మరువలేనిది. దేశం కోసం ఇల్లు వాకిలి వదిలి కుటుంబాలకు దూరమై తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులకు ప్రజలు ఎంతో విలువ ఇస్తుంటారు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆర్మీలో మీరు చేరాలనుకుంటున్నారా? ఆర్మీలో చేరడమే మీ లక్ష్యమైతే ఇదే మంచి ఛాన్స్. పలు ఉద్యోగాల భర్తీ కోసం సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. జూన్ 20న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనున్నది.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మొదటి ఈఎంఈ సెంటర్‌లో జూన్‌ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నారు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు. అగ్నివీర్‌ (జీడీ), అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, అగ్నివీర్‌ టీడీఎన్‌ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. యుద్ధంలో భర్తలను కోల్పోయిన వితంతువులు, వితంతువుల పిల్లలు, భారత సైన్యంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న వారి కుమారులతోపాటు సర్వీస్‌లో ఉన్న వారి సొంత సోదరులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 20న తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఈఎంఈ సెంటర్‌, 4వ ట్రైనింగ్‌ బెటాలియన్‌, కోటేశ్వర్‌ద్వార్‌ వద్దకు రావాలని కోరారు. అయితే ఈ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో స్పోర్ట్స్ కోటా కింద స్విమ్మింగ్, వాలీబాల్ క్రీడాకారులను అర్హులుగా పరిగణిస్తామని వెల్లడించారు. అయితే ఈ పోస్టులకు మాత్రం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం awwaleagle@gmail.com, www.joinindianarmy@nic.in వెబ్‌సైట్లను లేదా 040-27863016 నంబరును సంప్రదించి సమాచారాన్ని తెలుసుకోవచ్చని సూచించారు.

Show comments