AP అటవీ శాఖలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. త్వరపడండి

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..

ప్రభుత్వ ఉద్యోగం ఎదుురు చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి ఫారెస్ట్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ 2024 ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు.. ఏప్రిల్ 15, 2024 నుం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మే 5, 2024 లాస్ట్ డేట్. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత, అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్, కంప్యూటర్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీపీఎస్సీ 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన సమాచారం మీకోసం..

AP ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024

  • పోస్ట్ నేమ్- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష
  • ఖాళీలు- 37
  • వేతనం- రూ. 48,440 – 1,37,220
  • ఏజ్ లిమిట్- 18-30 ఏళ్ల లోపు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో పరిమితి, వికలాంగులకు 10 రిలాక్సేషన్ ఇచ్చారు.
  • సెలక్షన్ ప్రాసెస్- స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్, సీపీటీ
  • అర్హత- సంబంధిత విభాగంలో డిగ్రీ
  • అధికారిక వెబ్‌సైట్- psc.ap.gov.in
  • పరీక్ష ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.370, మిగతా వారికి 120 రూపాయలు.
  • పరీక్ష తేదీలు- త్వరలోనే వెల్లడిస్తారు.

స్క్రీనింగ్ టెస్ట్..

దీనిలో భాగంగా 75 మార్కుల చొప్పున రెండు భాగాలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఇస్తారు. అలానే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ప్రతి తప్పు 1/3వ మార్కు చొప్పున నెగిటివి మార్క్ ఉంటుంది. మొత్తం పరీక్ష కోసం అభ్యర్థులకు 150 నిమిషాల టైమ్ ఇస్తారు.

మెయిన్స్ పరీక్ష..

ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షలో 5 పేపర్లు ఉంటాయి. పేపర్-1 లో క్వాలిఫైయ్ అయితే చాలు. అయితే, మెరిట్ జాబితాకు రావాలంటే, అభ్యర్థులు 2-5 వరకు మిగిలిన పేపర్లలో మంచి మార్కులు సాధించాలి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. తప్పు ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానాలకు 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొండి

 

Show comments