iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. APలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

జగన్ సర్కార్ నిరుద్యోగులకు మరో తీపి కబురును అందించింది. తాజగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

జగన్ సర్కార్ నిరుద్యోగులకు మరో తీపి కబురును అందించింది. తాజగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. APలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేషన్ ను విడుదల చేయగా ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1లో 81 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 01 నుంచి జనవరి 21 2024 వరకు దరఖాస్తుల చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా ఈ పోస్టులకు సంబంధించి మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నది ఏపీపీఎస్సీ.

పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. అదే విధంగా ఖాళీల వివరాలు, జీతం, వయసు, విద్యార్హతలు ఇంకా ఇతర సమాచారం 01-01-2024 నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ను పరిశీలించాలని కోరింది.  ఇక జగన్ సర్కార్ వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18, డీఎస్పీ (సివిల్‌) 26, డిప్యూటీ సూపరింటెండ్ ఆప్ జైల్ సర్వీస్ 01, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 01, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 01, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 03, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ -II 01, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 01, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4, , అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2 పోస్టులు ఉన్నాయి.

పరీక్ష విధానం:

  • ఆఫ్ లైన్ మోడ్ లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహించబోయే మెయిన్‌ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 01-01-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 21-01-2024

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్: