P Venkatesh
మీరు భవన నిర్మాణ రంగంలో పని చేస్తారా? మీకు తాపీ పనిలో అనుభవం ఉందా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. హైదరాబాద్ లో తాపీ పని ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది. రూ.4లక్షల పైనే జీతం అందించనున్నారు.
మీరు భవన నిర్మాణ రంగంలో పని చేస్తారా? మీకు తాపీ పనిలో అనుభవం ఉందా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. హైదరాబాద్ లో తాపీ పని ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది. రూ.4లక్షల పైనే జీతం అందించనున్నారు.
P Venkatesh
భవన నిర్మాణ రంగంలో కీలకంగా పనిచేసేవారు తాపీ మేస్త్రీలు. అద్దాల మేడలైనా, ఆకాశహార్య్మాలైనా కట్టాలంటే తాపీ మేస్త్రీ ఉండాల్సిందే. తమకున్న నైపుణ్యంతో భవనాలను నిర్మిస్తుంటారు తాపీ మేస్త్రీలు. అయితే తాపీ మేస్త్రీ పని ఎంతో శారీరక శ్రమతో కూడుకున్నపని. పొద్దంతా కష్టపడితే వెయ్యి నుంచి పదిహేను వందల వరకు కూలీ వస్తుంది. నెలకు సుమారుగా 30 వేల వరకు సంపాదించుకునే వీలుంటుంది. కానీ తాపీ మేస్త్రీ ఉద్యోగానికి నెలకు 4 లక్షలపైనే జీతం ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? నెలకు 4 లక్షలకు పైగా జీతంతో హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ మేసన్(తాపీ మేస్త్రీ) ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
ఐటీ ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయేలా ఉంది తాపీ మేస్త్రీ జీతం. తాజాగా హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తాపీ మేస్త్రీ కావాలంటూ కళ్లు చెదిరే జీతం ఆఫర్ చేస్తూ తమ వెబ్ సైట్‌లో యాడ్ ఇచ్చింది. తాపీ మేస్త్రీ వేతనం ఏకంగా రూ. 4,47,348 ఆ ప్రకటనలో వెల్లడించారు. ఎంపికైన వారికి జీతంతో పాటు అదనపు అలవెన్సులు కూడా అందనున్నాయి. ఈ ఉద్యోగాలు అమెరికా కాన్సులేట్‌లో శాశ్వత ఉద్యోగంగా తెలిపింది. తాపీ మేస్త్రీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి కనీసం 8వ తరగతి పూర్తి చేసి ఉండాలని తెలుస్తోంది.
ఎంపికైన అభ్యర్థి వారానికి 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అనుభవంతో పాటు పనిలో నైపుణ్యం, ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చిని ఈ ప్రకటనలో కోరారు. తాపీ మేస్త్రీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25,2024 గా నిర్ణయించారు. అయితే మరిన్ని వివరాలకు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ ఆఫీస్ కు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. తాపీ మేస్త్రీ ఉద్యోగాలకు 4 లక్షలకు పైనే జీతం అందించనుండడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం తాపీ పనిలో మీకు అనుభవం ఉన్నట్లైతే వెంటనే అప్లై చేసుకోండి.